మొక్కలకు ప్రేమను పంచండి!

మనుషుల్లాగే మొక్కలకు కూడా సరైన పోషణతో పాటు, కొద్దిగా ప్రేమ అవసరం. అప్పుడే అవి ఆరోగ్యంగా, చక్కగా ఎదుగుతాయి. మొక్క నాటేటప్పుడు దాని వేర్లను పరిశీలించండి. ఆ వేర్లు చిక్కుపడి ఉంటే వాటిని విడదీయండి. అలాగే ముదిరి పోయిన లేదా కుళ్లిపోయిన భాగాలను కత్తిరించండి.

Published : 31 Dec 2022 01:10 IST

మనుషుల్లాగే మొక్కలకు కూడా సరైన పోషణతో పాటు, కొద్దిగా ప్రేమ అవసరం. అప్పుడే అవి ఆరోగ్యంగా, చక్కగా ఎదుగుతాయి.

వేర్లను విడదీసి: మొక్క నాటేటప్పుడు దాని వేర్లను పరిశీలించండి. ఆ వేర్లు చిక్కుపడి ఉంటే వాటిని విడదీయండి. అలాగే ముదిరి పోయిన లేదా కుళ్లిపోయిన భాగాలను కత్తిరించండి. వేర్లకు ఎలాంటి హాని చేయకుండా జాగ్రత్తగా మొక్కని నాటాలి.

మట్టిలో పోషకాలు: తోటపని చేస్తున్నప్పుడు... మొక్కను నాటే మట్టి ఎంత సారవంతంగా ఉందో గమనించుకోవాలి. మొక్క తత్వాన్ని బట్టి అందులో కోకోపీట్‌, ఎన్‌పీకేలు ఉండే సమగ్ర ఎరువునీ, ఓ అరచెంచా వేపపిండినీ కలిపి సిద్ధం చేసుకుని నాటుకోవాలి. ఆ తర్వాత ఓ ప్రణాళిక ప్రకారం దానికి పోషకాలు అందిస్తే చక్కగా ఎదుగుతుంది.

పునరుత్తేజానికి: మొక్క కొత్త వాతావరణంలో ఇమడ లేకపోయినప్పుడు ఆకులు వాడిపోయి, రంగు తేలిపోతాయి. ఇలాంటి సందర్భంలో ఎప్సమ్‌ సాల్ట్‌ను వేస్తే దానికి కొంత ఉపశమనం. మొక్క ఆహారాన్ని తయారు చేసుకునే విధంగా క్లోరోఫిల్‌ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా మొక్క కఠిన పరిస్థితుల నుండి వేగంగా కోలుకోవడంతో పాటు పోషకాలను సులువుగా గ్రహించగలుగుతుంది.

నీళ్లు పోసేటప్పుడు: మొక్కకు నీళ్లు పోసేప్పుడు దాని అవసరాల్ని అర్థం చేసుకోవాలి. ఎంత విరామంలో నీళ్లను అందించాలో తెలుసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా వారం పదిరోజులు ఊరు వెళ్లాల్సి వస్తే... మట్టిలో కాసిని హైడ్రోజన్‌ క్రిస్టల్స్‌ని కలపండి. ఇవి మొక్కలకు అవసరమయ్యే తేమను భద్రపరిచి నెమ్మదిగా అందిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్