సైకిల్‌ తొక్కితే బరువు తగ్గొచ్చు..

ఈరోజుల్లో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగినా... వ్యాయామం చేయడంలో మహిళలు ఇప్పటికీ వెనకబడే ఉన్నారు. సమయాభావం, జిమ్‌కి వెళ్లలేకపోవడం వంటివెన్నో ఇందుకు కారణాలు... ఇలాంటప్పుడు సైక్లింగ్‌ని ఎంచుకుంటే మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయంటారు వ్యాయామ నిపుణులు. మరి దాని ప్రయోజనాలు చూద్దామా...

Published : 23 Mar 2023 00:11 IST

ఈరోజుల్లో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగినా... వ్యాయామం చేయడంలో మహిళలు ఇప్పటికీ వెనకబడే ఉన్నారు. సమయాభావం, జిమ్‌కి వెళ్లలేకపోవడం వంటివెన్నో ఇందుకు కారణాలు... ఇలాంటప్పుడు సైక్లింగ్‌ని ఎంచుకుంటే మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయంటారు వ్యాయామ నిపుణులు. మరి దాని ప్రయోజనాలు చూద్దామా...

వారంలో మూడుసార్లైనా సైకిల్‌ తొక్కి చూడండి. కొలెస్ట్రాల్‌, రక్తపోటు అదుపులో ఉంటాయి. ఇలా చేయడం వల్ల  ఒత్తిడి కూడా అదుపులో ఉంటుంది. ఓ గంట సైకిలు తొక్కితే కనీసం 300 కెలొరీలు ఖర్చవుతాయి.

సైకిలు తొక్కినప్పుడు మెదడు నుంచి న్యూరోట్రాన్స్‌మీటర్లు విడుదలవుతాయి. ఇవి జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తాయి.  ఏకాగ్రతా, చురుకుదనం కూడా పెరుగుతాయి.

నడిచినప్పుడూ, పరుగుపెట్టినప్పుడూ మోకాళ్లూ, వెన్నుపై కొంత ఒత్తిడి పడే ఆస్కారం ఉంటుంది. కానీ, సైకిలు తొక్కడం వల్ల కీళ్లపై పడే ఒత్తిడి తక్కువ. ప్రయోజనాలు ఎక్కువ. తొడలూ, పిరుదుల వద్ద పేరుకున్న కొవ్వూ కరుగుతుంది.

వారంలో మూడురోజులు కొంత సమయం సైకిల్‌ తొక్కడం వల్ల శరీరం యవ్వనంగా మారడమే కాకుండా.. నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి. సిజేరియన్ల కారణంగా వచ్చిన వెన్నునొప్పి అదుపులోకి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్