పిల్లలు డీహైడ్రేషన్‌కి గురి కాకుండా..!

ఎండాకాలంలో చిన్నారులు ఆటల్లో పడి ఎండ తీవ్రత తమపై పడుతుందన్న విషయాన్ని పట్టించుకోరు. ఫలితంగా డీహైడ్రేషన్‌కి గురవుతారు. అలాగని చిన్నారుల మానసిక వికాసానికి తోడ్పడే ఆటల నుంచి వారిని దూరం చేయలేం కదా.. అందుకే ఎండ ప్రభావం వారిపై పడకుండా.. వారు డీహైడ్రేషన్‌కి గురికాకుండా.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Published : 03 May 2024 12:25 IST

ఎండాకాలంలో చిన్నారులు ఆటల్లో పడి ఎండ తీవ్రత తమపై పడుతుందన్న విషయాన్ని పట్టించుకోరు. ఫలితంగా డీహైడ్రేషన్‌కి గురవుతారు. అలాగని చిన్నారుల మానసిక వికాసానికి తోడ్పడే ఆటల నుంచి వారిని దూరం చేయలేం కదా.. అందుకే ఎండ ప్రభావం వారిపై పడకుండా.. వారు డీహైడ్రేషన్‌కి గురికాకుండా.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఇవీ డీహైడ్రేషన్ లక్షణాలు..

అధిక ఉష్ణోగ్రతల్లోనూ శరీరం చల్లగా ఉండేందుకు చర్మం అధిక మొత్తంలో చెమట ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇలా చెమట ద్వారా శరీరంలోని నీరు, లవణాలు అధికమొత్తంలో బయటకు వెళ్లిపోతే డీహైడ్రేషన్‌కి గురవుతాం. వేసవిలో చిన్నారులు డీహైడ్రేషన్‌కి గురవుతున్నారనే విషయాన్ని మనం ముందుగానే గుర్తించవచ్చు. నీరసంగా కనిపించడం, నోరు పొడిగా తయారవడం, మూత్రవిసర్జన తక్కువగా ఉండడం, వాంతులు చేసుకోవడంతో పాటు చిరాగ్గా ఉన్నట్టు కనిపిస్తే.. వారు డీహైడ్రేషన్‌కి గురవుతున్నట్లుగా గుర్తించాలి. ఈ సమయంలో వారిని ఆటలకు కాస్త బ్రేక్ ఇవ్వమని చెప్పి నీరు, మజ్జిగ, పండ్లు వంటివి వారికి అందించాలి. అవసరమైతే వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది.

15 నుంచి 20 నిమిషాలకోసారి..

శరీరం నుంచి చెమట ద్వారా బయటకు వెళ్లిపోయిన నీటి లోటును ఎప్పటికప్పుడు భర్తీ చేయాల్సి ఉంటుంది. లేదంటే డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చిన్నారులకు దాహం వేస్తున్నా వేయకపోయినా.. ప్రతి పావుగంట నుంచి ఇరవై నిమిషాలకోసారి గ్లాసు నీటిని తాగమని వారికి అందించాలి. ఎప్పుడూ నీటిని తాగడానికి చిన్నారులు అంత ఆసక్తి చూపించకపోవచ్చు. అందుకోసం మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, కీరా-పండ్ల ముక్కల్ని నీటిలో వేసి అందించడం (Infused Waters).. వంటివి కూడా అవసరం. అలాగే నీటిశాతం ఎక్కువగా ఉన్న పుచ్చ, తర్బూజా లాంటి పండ్లను కూడా వారికి అందించాలి. వేసవిలో కూల్‌డ్రింక్‌లను చిన్నారులకు అందించకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే కెఫీన్ సహా ఇతర పదార్థాలు చిన్నారుల్లో డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి.

ఇవి కూడా..

⚛ వేసవిలో ఎక్కువ సమయం ఆటల్లోనే గడిపే చిన్నారుల వస్త్రధారణ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీలైనంత వరకు వారికి లేత రంగుల్లో ఉన్న నూలు వస్త్రాలనే తొడగాలి. అవి కూడా వదులుగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వారిపై పడకుండా ఉంటుంది.

⚛ నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఏమీ తినకుండా, తాగకుండా చిన్నారులు ఉన్నట్త్లెతే వారు డీహైడ్రేషన్‌కి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారికి సరైన సమయానికి ఆహారం, నీరు అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్