బాత్రూమ్ చిన్నగా ఉందా..?

సాధారణంగా చాలామంది ఇళ్లలో బాత్రూమ్‌ చిన్నగానే ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా చిన్నదిగా ఉన్న బాత్రూమ్‌ని కూడా కాస్త పెద్దదిగా కనిపించేలా చేస్తూనే అందంగా అలంకరించుకోవచ్చంటున్నారు ఇంటీరియర్ నిపుణులు.

Published : 24 Feb 2024 12:29 IST

సాధారణంగా చాలామంది ఇళ్లలో బాత్రూమ్‌ చిన్నగానే ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా చిన్నదిగా ఉన్న బాత్రూమ్‌ని కూడా కాస్త పెద్దదిగా కనిపించేలా చేస్తూనే అందంగా అలంకరించుకోవచ్చంటున్నారు ఇంటీరియర్ నిపుణులు.

తెలుపు రంగుతో..
బాత్రూమ్‌లో తెలుపు రంగు పెయింట్ వేయిస్తే గదంతా ప్రకాశవంతంగా కనిపించడమే కాదు.. కాస్త విశాలంగా, ఎలిగెంట్‌గా కనబడుతుంది. అయితే ప్లెయిన్ కలర్‌ని ఉపయోగించడం ఇష్టం లేనివారు దీనిని నచ్చిన షేడ్స్‌తో మిక్స్ చేసి కూడా పెయింట్ చేసుకోవచ్చు. ఫలితంగా భిన్నమైన లుక్‌తోపాటు బాత్రూమ్ కాస్త పెద్దదిగానూ కనిపించేలా చేయచ్చు.

గోడ పైనే పొందిగ్గా..!
మనం ఉపయోగించే రకరకాల సబ్బులు, షాంపూలు.. అన్నీ బాత్రూమ్‌లోనే అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గోడకు చిన్న చిన్న షెల్ఫ్స్ ఏర్పాటుచేసి వాటి పైనే అవన్నీ అందంగా సర్దుకోవచ్చు. పైగా ఈ షెల్ఫ్‌లను మనకు నచ్చినట్లు అలంకరించుకునే వీలు కూడా ఉంటుంది. వుడెన్, గ్లాస్.. ఇలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న, మీకు నచ్చిన షెల్ఫ్‌లను ఏర్పాటుచేసుకోవడం ద్వారా కూడా బాత్రూమ్‌కి భిన్నమైన లుక్‌ని తీసుకురావచ్చు. అయితే ఎంచుకున్న మెటీరియల్‌కు అనుగుణంగానే దానిని అలంకరించడం కూడా ముఖ్యమే అని గుర్తుంచుకోవాలి.

అందమైన అద్దం..!
ప్రదేశం ఏదైనా సరే.. చిన్నదిగా కనిపించినప్పుడు దాన్ని విశాలంగా కనిపించేలా చేయాలంటే చాలామంది పాటించే మొట్టమొదటి చిట్కా ఆ ప్రదేశంలో ఒక అద్దాన్ని అమర్చడం. దీనినే బాత్రూమ్ విషయంలో కూడా అనుసరించవచ్చు. అయితే ఇందుకు ఎంపిక చేసుకునే అద్దం డిజైన్, పరిమాణం విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరీ చిన్నదిగా లేదా పెద్దదిగా కాకుండా మధ్యస్థ పరిమాణంలో ఉన్న అద్దాన్ని ఎంపిక చేసుకొని బాత్రూమ్‌లో గోడకు ఫిట్ చేసి చూడండి. దానిలో కనిపించే ప్రతిబింబం వల్ల బాత్రూమ్ కాస్త పెద్దదిగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఆ అద్దం చుట్టూ అందమైన స్టిక్కర్స్ లేదా తీగజాతి పూలను అమర్చండి. ఇది గది మొత్తానికి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.

ప్రకాశవంతంగా కనిపించేలా..
ఇంటిని అందంగా, పొందిగ్గా అమర్చుకునే చాలామంది బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి మాత్రం అంతగా దృష్టి సారించరనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఆ గదిలో ఏర్పాటుచేసే వెలుతురు విషయంలోనూ కాస్త అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. అయితే బాత్రూమ్ కాస్త విశాలంగా కనిపించాలంటే అందుకు ఆ గదిలో ఏర్పాటుచేసే లైటింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే! సాధారణంగా గదిలో వెలుతురు ఎంత ఎక్కువగా ఉంటే గది అంత విశాలంగా కనిపించే అవకాశాలుంటాయి. కాబట్టి బాత్రూమ్‌లో లైట్లు బిగించేటప్పుడు ఈ విషయం తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్