ఆ మరకలు పోవాలంటే..!

తినేటప్పుడైనా లేదంటే ఏదైనా పనిచేసేటప్పుడైనా దుస్తులపై వివిధ రకాల మరకలు పడడం సహజం. అయితే వీటిలో కొన్ని రకాల మరకలు సులభంగా వదిలిపోతే.. మరికొన్నింటిని తొలగించడం మాత్రం కష్టం.

Published : 28 Dec 2023 12:19 IST

తినేటప్పుడైనా లేదంటే ఏదైనా పనిచేసేటప్పుడైనా దుస్తులపై వివిధ రకాల మరకలు పడడం సహజం. అయితే వీటిలో కొన్ని రకాల మరకలు సులభంగా వదిలిపోతే.. మరికొన్నింటిని తొలగించడం మాత్రం కష్టం. అలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

రంగు మరకలు

రంగు పోయే దుస్తుల్ని ఇతర దుస్తులతో కలిపి నానబెట్టినప్పుడు లేదంటే వాషింగ్‌ మెషీన్‌లో ఉతికేటప్పుడు వాటి రంగు మిగతా వాటికి అంటుకోవడం సహజమే! ముఖ్యంగా తెలుపు రంగు దుస్తుల విషయంలో ఎక్కువగా ఇలా జరుగుతుంటుంది. అయితే ఎంత ఉతికినా ఈ రంగు ఓ పట్టాన వదలదు. ఇలాంటప్పుడు ఒక చిన్న తెల్ల గుడ్డ ముక్క తీసుకొని.. దానిపై హెయిర్‌ స్ప్రే, రబ్బింగ్‌ ఆల్కహాల్‌ లేదంటే 90 శాతం ఆల్కహాల్‌ ఉన్న ఏదైనా ద్రావణం పోసి.. దాంతో మరక పడ్డ చోట పదే పదే తుడుస్తుండాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మరక వదిలిపోతుంది. ఆపై దీన్ని సాధారణంగా ఉతికి ఆరేస్తే సరిపోతుంది.

పాల మరకలు

పాలిచ్చే తల్లులకు ఎక్కువ మొత్తంలో పాలు ఉత్పత్తవడం వల్ల అవి లీకై దుస్తులపై మరకలు పడుతుంటాయి. వాటిని తొలగించడానికి.. ముందుగా బ్రష్‌తో ఆ మరకపై రుద్దాలి. ఆపై డిటర్జెంట్‌ వేసిన చల్లటి నీటిలో అరగంట పాటు నానబెట్టాలి. తద్వారా ఫలితం ఉంటుంది. ఇదనే కాదు.. సాధారణ పాల మరకలు, కోడిగుడ్డు సొన మరకలు వదిలించుకోవడానికి కూడా ఈ చిట్కాను పాటించచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్