భలే భలే బెడ్‌ల్యాంప్స్‌!

సముద్రపు ఆల్చిప్ప, స్టార్‌, ఆకు, పుట్టగొడుగు, వాల్‌ హ్యాంగింగ్‌, చెట్టుకు వేలాడినట్లుగా.. ఇలా విభిన్న డిజైన్లలో రూపొందించిన బెడ్‌ల్యాంప్స్‌ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక పిల్లల గదిలో వాళ్లు ఎక్కువగా ఇష్టపడే బొమ్మలు, గ్లోబు మాదిరిగా ఉండేవి, సౌరవ్యవస్థ థీమ్‌తో కూడినవి, చంద్రవంక, బాతు ఆకృతిలో రూపొందించినవి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిజైన్లలో ఇవి దొరుకుతున్నాయి.

Published : 15 Apr 2024 12:30 IST

రాత్రుళ్లు బెడ్‌ల్యాంప్‌/నైట్‌ ల్యాంప్‌ లేనిదే నిద్రపోరు చాలామంది. ఈ క్రమంలోనే పడకగదిలో చిన్న బల్బు అమర్చుకుంటారు. అయితే ఒక్కోసారి ఈ బల్బు లైటింగ్‌కీ నిద్రపట్టకపోవచ్చు.. ఇంకా తక్కువ వెలుతురు ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. ఇందుకు ప్రత్యామ్నాయమే ఈ ప్రత్యేకమైన నైట్‌ ల్యాంప్స్‌!

సముద్రపు ఆల్చిప్ప, స్టార్‌, ఆకు, పుట్టగొడుగు, వాల్‌ హ్యాంగింగ్‌, చెట్టుకు వేలాడినట్లుగా.. ఇలా విభిన్న డిజైన్లలో రూపొందించిన బెడ్‌ల్యాంప్స్‌ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక పిల్లల గదిలో వాళ్లు ఎక్కువగా ఇష్టపడే బొమ్మలు, గ్లోబు మాదిరిగా ఉండేవి, సౌరవ్యవస్థ థీమ్‌తో కూడినవి, చంద్రవంక, బాతు ఆకృతిలో రూపొందించినవి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిజైన్లలో ఇవి దొరుకుతున్నాయి. వీటిలోనూ కొన్ని వేర్వేరు రంగుల్లో వెలుతురును వెదజల్లే లాంటివీ లభిస్తున్నాయి. ఇలాంటి బెడ్‌ల్యాంప్స్‌లో కొన్ని నేరుగా సాకెట్‌లో పెట్టుకునే ప్లగ్‌ మాదిరిగా, మరికొన్ని యూఎస్‌బీ పోర్ట్‌ కనెక్ట్‌ చేసుకునేలా, ఇంకొన్ని రిమోట్‌తో ఆపరేట్‌ చేసుకునేలా, బ్యాటరీతో నడిచేవి, టచ్‌ చేస్తే వెలిగేవి.. ఇలా వాటి ప్రత్యేకమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఇంటికి సరికొత్త అందమూ తీసుకొస్తున్నాయి. వీటిలో కొన్నింటికి వెలుతురును తక్కువగా, ఎక్కువగా సెట్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా ఉంది. ఇలా ఎన్నో ఫీచర్లతో కూడిన విభిన్న నైట్‌ ల్యాంప్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్