శీతకాలంలో కుంకుమ పువ్వు

పండంటి బిడ్డ పుట్టాలంటూ గర్భిణులతో కుంకుమపువ్వు తినిపించడం తెలిసిందే. ఔషధగుణాలు పుష్కలంగా ఉండే ఇది శీతకాలంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్నీ ఇస్తుంది.

Published : 28 Dec 2022 01:10 IST

పండంటి బిడ్డ పుట్టాలంటూ గర్భిణులతో కుంకుమపువ్వు తినిపించడం తెలిసిందే. ఔషధగుణాలు పుష్కలంగా ఉండే ఇది శీతకాలంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్నీ ఇస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్‌ గుణాలు దీనిలో మెండు. తరచూ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగు తుంది. నరాల వ్యవస్థపై ప్రభావం చూపి ఆందోళన, ఒత్తిడులను దరి చేరనీయదు. శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపి, జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. అధికబరువుకూ చెక్‌ పెట్టగలదు. జలుబు, దగ్గు వంటివీ దరికి చేరవు.

వయసును దాచి..

కుంకుమపువ్వు చర్మసౌందర్యాన్ని పెంచి ముఖంపై ముడతలు, ఇతర వృద్ధాప్య ఛాయలను త్వరగా రానివ్వదు. రాత్రి నిద్ర పోయే ముందు గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు కలిపి తీసుకుంటే.. కార్టిసాల్‌ స్థాయులు తగ్గేలా చేసి కంటి నిండా నిద్రపట్టడానికి దోహదపడుతుంది. రెండు కుంకుమపువ్వు రేకలను రాత్రంతా పావుకప్పు నీటిలో నానబెట్టి పరగడుపున తీసుకుంటే చాలు. నెలసరిలో వచ్చే కడుపు నొప్పి, మూడ్‌ స్వింగ్స్‌ దూరమవుతాయి. వీటి రేకలను పాలు లేదా హెర్బల్‌టీలో కాసేపు నాననిచ్చి తాగితే, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై పిగ్మంటేషన్‌ మచ్చలు, గీతలు దూరమవుతాయి. సూర్య కిరణాల దుష్ప్రభావాల నుంచి కాపాడుతుంది. చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది. ఇలా రోజూ చేస్తే పదేళ్ల వయసు తగ్గినట్లుగా ముడతల్లేకుండా.. ముఖం మెరుపులీనుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్