చూయింగ్ గమ్‌ని వదిలించాలంటే..!

చూయింగ్ గమ్ నమలడం దవడ కండరాలకు మంచి వ్యాయామమే. అయితే కొందరు దాన్ని పడేసేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. బెంచీలు, కుర్చీలు, డెస్కులు, వాహనాల సీట్లపై అతికించడం, ఎక్కడ పడితే అక్కడ పడేయడం.. వంటివి చేస్తుంటారు. దీంతో మనకు తెలియకుండానే అది మన దుస్తులకు అతుక్కుపోతుంటుంది.

Published : 19 Apr 2024 21:46 IST

చూయింగ్ గమ్ నమలడం దవడ కండరాలకు మంచి వ్యాయామమే. అయితే కొందరు దాన్ని పడేసేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. బెంచీలు, కుర్చీలు, డెస్కులు, వాహనాల సీట్లపై అతికించడం, ఎక్కడ పడితే అక్కడ పడేయడం.. వంటివి చేస్తుంటారు. దీంతో మనకు తెలియకుండానే అది మన దుస్తులకు అతుక్కుపోతుంటుంది. ఆపై ఎంత రుద్దినా ఓ పట్టాన వదలదు. అలాంటప్పుడు ఈ సింపుల్‌ చిట్కాలు పాటిస్తే సత్వర ఫలితం ఉంటుంది.

⚛ చూయింగ్ గమ్ అంటుకున్న చోట కొద్దిసేపు ఐస్‌క్యూబ్స్ ఉంచితే దానిని సులభంగా తొలగించచ్చు.

⚛ దుస్తులకంటిన చూయింగ్‌గమ్‌ని వైట్ వెనిగర్ సులభంగా వదిలించేస్తుంది. దీనికోసం ఒక గిన్నెలో వెనిగర్‌ని తీసుకొని అవెన్‌లో నిమిషం పాటు వేడి చేయాలి. ఆ తర్వాత దానిని బయటకు తీసి చూయింగ్ గమ్ అంటుకున్న భాగాన్ని మాత్రమే అందులో ముంచాలి. ఇలా రెండు నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత టూత్‌బ్రష్ సాయంతో రుద్దితే గమ్ సులభంగా వదిలిపోతుంది.

⚛ రబ్బింగ్ ఆల్కహాల్ సైతం దుస్తులకంటిన చూయింగ్‌గమ్‌ను వదలగొడుతుంది. దీనికోసం స్పాంజ్‌పై రబ్బింగ్ ఆల్కహాల్ పోసి దాంతో గమ్‌ను తుడవాలి. రెండు నిమిషాలు ఇలా చేసిన తర్వాత వుడెన్ స్పూన్ సాయంతో చూయింగ్ గమ్‌ని తీసేస్తే సరిపోతుంది. రబ్బింగ్ ఆల్కహాల్ వల్ల దుస్తుల రంగు, నాణ్యత కూడా దెబ్బతినదు.

⚛ వేడినీళ్లతో సైతం చూయింగ్ గమ్‌ని వదలగొట్టచ్చు. ఈ నీటిలో చూయింగ్ గమ్ అంటుకున్న వస్త్రాన్ని ముంచాలి. ఆపై టూత్ బ్రష్‌తో రుద్దడం ద్వారా గమ్‌ని సులభంగా వదలగొట్టచ్చు.

⚛ ఐరన్ చేయడం ద్వారా కూడా దుస్తులకంటిన చూయింగ్ గమ్‌ని సులభంగా వదిలించచ్చు. దీనికోసం ఐరనింగ్ బోర్డుపై కార్డుబోర్డునుంచాలి. దీనిపై గమ్ అంటుకున్న భాగం కిందికి వచ్చేలా వస్త్రాన్ని పరచాలి. గమ్ అంటుకున్న భాగంపై కర్చీఫ్ లేదా మరో వస్త్రాన్ని ఉంచి హాట్ ఐరన్ చేయాలి. ఐరన్‌బాక్స్ విడుదల చేసే వేడికి చూయింగ్ గమ్ కరిగిపోయి కార్డుబోర్డుకు అతుక్కుపోతుంది.

⚛ చూయింగ్ గమ్ అంటుకున్న చోట కొద్దిగా సోప్ రాసి టూత్‌బ్రష్ సాయంతో కాసేపు రుద్దాలి. అరగంట తర్వాత మరోసారి టూత్‌బ్రష్‌తో రుద్దితే గమ్ సులభంగా వదిలిపోతుంది.

⚛ హెయిర్‌స్ప్రేతో సైతం వస్త్రానికి అతుక్కున్న చూయింగ్ గమ్‌ని సులభంగా వదిలించచ్చు. దీనికోసం గమ్ ఉన్న చోట కొద్దిగా హెయిర్‌స్ప్రేను స్ప్రే చేయాలి. ఇది చూయింగ్ గమ్‌ను చల్లబడేలా చేస్తుంది. దీంతో చూయింగ్ గమ్‌ని సులభంగా తీసేయచ్చు. అయితే ఒకసారి స్ప్రే చేసినప్పుడు గమ్ వదలకపోతే.. మరోసారి ప్రయత్నిస్తే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్