తరచూ ఆ సమస్యా?

తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందా... కారణం ఎక్కువసేపు మూత్రాన్ని నిలిపి ఉంచడం వల్ల మూత్రనాళంలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు. వేసవిలో ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని రకాల ఆహార నియమాలు పాటిస్తే అధిగమించవచ్చు.

Published : 27 May 2024 02:48 IST

తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందా... కారణం ఎక్కువసేపు మూత్రాన్ని నిలిపి ఉంచడం వల్ల మూత్రనాళంలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు. వేసవిలో ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని రకాల ఆహార నియమాలు పాటిస్తే అధిగమించవచ్చు.

  • దానిమ్మ.. పదే పదే మంటతో కూడిన మూత్ర విసర్జన అవుతుంటే... యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌- సి పుష్కలంగా ఉండే దానిమ్మరసం తీసుకోవాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా దాడిచేయకుండా కాపాడుతుంది.
  • ఉలవలు... కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉండి ట్యాక్సిన్లను తొలగిస్తాయి. వేయించిన ఉలవలను పొడిచేసి నేరుగా తీసుకున్నా, నీటిలో కలిపి తాగినా మేలే. ఇలా రెండు వారాలు చేస్తే ఫలితం ఉంటుంది.
  • మెంతులు.. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తాయి. చెంచా మెంతిపొడిని గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి, దంచిన చిన్న అల్లం ముక్క, చెంచా తేనె కలిపి రోజూ రెండుసార్లు తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.
  • బచ్చలికూర... ఎక్కువ పోషకాలుండే ఈ కూర మూత్రాశయ సమస్యతో బాధపడుతున్న వారికీ, మూత్రపిండాల ఆరోగ్యానికీ ఎంతో మేలు. ప్రొటీన్లు, ఐరన్, విటమిన్‌-ఎ మెండుగా ఉండే దీన్ని పావుకప్పు నీటిలో ఐదునిమిషాలు ఉడికించాలి. ఆపై ఆ నీళ్లను వడకట్టి గోరువెచ్చగా తాగితే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్