చలికాలంలో పిల్లల ఆరోగ్యం కోసం..

తీసుకునే ఆహారం విషయంలో మనమే మన కోరికల్ని కంట్రోల్‌ చేసుకోలేం. అలాంటిది పిల్లలెలా వింటారు. చలికాలమైనా ఐస్‌క్రీమ్‌ కావాలని, అనారోగ్యమని తెలిసినా పిజ్జా, బర్గర్లు తింటామని మారాం చేస్తుంటారు. ఇక ఈ క్రమంలో పిల్లల్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను పిల్లలకు అలవాటు చేయడం తల్లులకు కత్తి మీద సామే! అయితే చిన్నారులకు ఒక్కో ఆహార పదార్థం అలవాటు.....

Published : 03 Jan 2023 13:23 IST

తీసుకునే ఆహారం విషయంలో మనమే మన కోరికల్ని కంట్రోల్‌ చేసుకోలేం. అలాంటిది పిల్లలెలా వింటారు. చలికాలమైనా ఐస్‌క్రీమ్‌ కావాలని, అనారోగ్యమని తెలిసినా పిజ్జా, బర్గర్లు తింటామని మారాం చేస్తుంటారు. ఇక ఈ క్రమంలో పిల్లల్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను పిల్లలకు అలవాటు చేయడం తల్లులకు కత్తి మీద సామే! అయితే చిన్నారులకు ఒక్కో ఆహార పదార్థం అలవాటు చేసే క్రమంలోనే హెల్దీ ఆప్షన్స్‌ ఎంచుకోవాలని, ఈ క్రమంలో మన పూర్వీకులు పాటించిన ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను వారికి అలవర్చాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా పిల్లలకు పసి వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే.. పెద్దయ్యాక కూడా వారు అవే అలవాట్లను కొనసాగించే అవకాశం ఉందని, తద్వారా తల్లులకు తమ పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి దిగులూ ఉండదని చెబుతున్నారు.

ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ సక్రమంగా జరుగుతాయి. అయితే పిల్లలు మాత్రం ఇవేవీ వినిపించుకోరు. అవి ఆరోగ్యానికి మంచివి కావు.. అని చెప్పినా అవే కావాలని పట్టుబడతారు. పెద్దయ్యాక పిల్లలు ఇలా తయారుకాకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే వారికి ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలవాటు చేయాలి. ఈ క్రమంలో మన పెద్దలు తమ పిల్లల విషయంలో పాటించిన చిట్కాలను, ఆరోగ్యకరమైన వంటకాలను మనమూ మన పిల్లలకు అలవాటు చేయించాలి.

అనారోగ్యాలకు దూరంగా..

సీజన్‌ మారుతున్న కొద్దీ మనం ఎలాగైతే మన ఆహారపుటలవాట్లలో మార్పులు-చేర్పులు చేసుకుంటామో.. పిల్లల విషయంలోనూ ఇది పాటించాలి. ఈ క్రమంలో తాజాగా, చక్కటి పోషకాహారంతో కూడిన పదార్థాలు అందిస్తే.. అవి వారిని ఆయా కాలాల్లో ఎదురయ్యే ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉంచుతాయి. ఇక ఈ చలికాలంలో సాధారణంగానే పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. పైగా ఇది పండగల సీజన్‌ కూడా! ఇలాంటి సమయాల్లో స్వీట్స్‌, డెజర్ట్స్‌.. వంటివి చేసుకోవడం మామూలే. ఈ క్రమంలో చక్కెరకు బదులు బెల్లం, దాల్చినచెక్క పొడి.. వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. పిల్లలకు అటు ఆరోగ్యకరమైన ఆహారం, ఇటు అప్పుడప్పుడూ వారికి నచ్చిన ఆహారం అందిస్తూ వారి ఆహారపు కోరికల్ని అదుపు చేస్తే వాళ్లు మనం చెప్పిన మాట వింటారు.. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఎప్పుడైనా జలుబు, దగ్గు అనిపిస్తే ఆవిరి పట్టడంతో పాటు రోజూ రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగించడం వంటివి చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్