Winter Tips : ఈ సూప్‌.. హెల్దీ, టేస్టీ!

చలికాలంలో వెచ్చదనం కోసం చాలామంది సూప్స్‌ని ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. అయితే వెచ్చదనాన్ని పంచే ఈ సూప్స్‌ ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కూ మంచివంటున్నారు నిపుణులు. ఈ సూప్‌ కూడా అలాంటిదే!

Published : 23 Nov 2023 13:18 IST

చలికాలంలో వెచ్చదనం కోసం చాలామంది సూప్స్‌ని ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. అయితే వెచ్చదనాన్ని పంచే ఈ సూప్స్‌ ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కూ మంచివంటున్నారు నిపుణులు. ఈ సూప్‌ కూడా అలాంటిదే!

బాదం- మష్రూమ్ సూప్

కావాల్సినవి

బాదంపప్పులు - అరకప్పు

పాలు - అరకప్పు

మష్రూమ్స్‌ - 50 గ్రాములు

వెన్న - 2 టేబుల్‌ స్పూన్లు

మైదా - 4 టేబుల్‌ స్పూన్లు

నీళ్లు - 4 కప్పులు

ఉప్పు - 2 టేబుల్‌ స్పూన్లు

మిరియాల పొడి - పావు చెంచా

క్రీమ్‌ - 4 టేబుల్‌ స్పూన్లు

తయారీ

నానబెట్టిన బాదంపప్పులపై పొట్టు తొలగించి.. వాటిలో కొన్నింటిని తీసుకొని మీడియం సైజులో తరిగి పక్కన పెట్టుకోవాలి. మిగతా బాదంపప్పులను పాలలో వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ప్యాన్‌లో వెన్న వేసి తరిగిన బాదంపప్పులు, మష్రూమ్స్‌ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మైదా వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మైదా ఉండలు కట్టకుండా మిశ్రమాన్ని కలుపుతుండాలి. ఇప్పుడు మంట తగ్గించుకొని ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న బాదం పాలను దీనికి చేర్చుకోవాలి. ఈ మిశ్రమానికి సరిపోయేంత ఉప్పు, మిరియాల పొడి చేర్చి అయిదు నిమిషాల పాటు సిమ్‌లో ఉంచాలి. ఈ క్రమంలో ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత దించి క్రీమ్‌ కలుపుకొంటే.. రుచి, ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను అందించే బాదం సూప్‌ రడీ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్