Cargo Ship: మంటల్లోనే ‘కార్ల నౌక’..! ఆ మృతుడు భారత్‌కు చెందిన వ్యక్తే

జర్మనీ నుంచి సింగపూర్‌కు కార్లను తరలిస్తోన్న ఓ కార్గో నౌక.. నెదర్లాండ్స్‌ తీరంలో మంటల్లో చిక్కుకుపోయిన ఘటనలో ఓ భారతీయుడు మృతి చెందాడు. నెదర్లాండ్స్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

Published : 27 Jul 2023 16:01 IST

ది హేగ్‌: జర్మనీ నుంచి సింగపూర్‌కు 2,857 కార్లతో బయల్దేరిన ఓ రవాణానౌక (Fremantle Highway) బుధవారం నెదర్లాండ్స్‌ తీరంలో మంటల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. అయితే, ఆ చనిపోయిన వ్యక్తిని భారతీయుడిగా గుర్తించారు. నెదర్లాండ్స్‌లోని భారత రాయబార కార్యాలయం (India In Netherlands) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే, అతడి వివరాలు తెలియరాలేదు.

‘నౌకలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఒక భారతీయ నావికుడు మృతి చెందారు. పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి. మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేస్తున్నాం. గాయపడిన సిబ్బందితో కూడా టచ్‌లో ఉన్నాం. వారంతా క్షేమంగా ఉన్నారు. నెదర్లాండ్స్‌ అధికారులు, షిప్పింగ్ కంపెనీ సమన్వయంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని భారత ఎంబసీ పేర్కొంది. గాయపడిన వారిలో భారతీయులు ఉన్నారా? తెలియాల్సి ఉంది.

సైన్యం తిరుగుబాటు.. బందీగా అధ్యక్షుడు..!

నౌకలోని 25 ఎలక్ట్రిక్‌ కార్లలో ఒకదానికి నిప్పంటుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. మంటలు ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. రోజులు తరబడి ఈ మంటలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నౌక మునిగిపోతే.. పెద్దమొత్తంలో ఇంధనం, ఇతర కాలుష్యాలు సముద్రంలో కలిసే అవకాశం ఉందన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముప్పును తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని