Iran Israel conflict: ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్‌కు ఎయిరిండియా సేవలు బంద్‌

ఇరాన్‌ డ్రోన్ల ప్రయోగంతో పశ్చిమాసియాలో ఏర్పడ్డ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.

Published : 14 Apr 2024 23:05 IST

దిల్లీ: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్ల దాడితో పశ్చిమాసియాలో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకొంది. టెల్‌ అవీవ్‌కు విమానాలను తాత్కాలికంగా నిలివేయాలని ఆదివారం నిర్ణయించింది. దిల్లీ- టెల్‌ అవీవ్‌ మధ్య వారానికి నాలుగు సర్వీసులను ఎయిరిండియా నడుపుతోంది. ప్రస్తుతం నేరుగా వెళ్లే విమానాలను నిలివేయనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన నేపథ్యంలో సేవలను నిలిపివేసిన ఎయిరిండియా.. దాదాపు ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ మార్చి 3 నుంచి సేవలను పునఃప్రారంభించింది.

రంగంలోకి అమెరికా.. ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా ఉంటామన్న బైడెన్

మరోవైపు.. ఎయిరిండియా ఇరాన్‌ గగనతలం మీదుగా రాకపోకలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. దాంతో ఐరోపాకు వెళ్లే విమానాలు సుదీర్గ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది. ఇరాన్‌ శనివారం ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్ది డ్రోన్‌లను ప్రయోగించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. వాటిని ఎదుర్కొంనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్‌ మిలటరీ పేర్కొంది. మరోవైపు, టెలీ అవీవ్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా భరోసా ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని