South Africa: దక్షిణాఫ్రికా నైట్‌క్లబ్‌లో అనుమానాస్పద స్థితిలో 17 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని ఈస్ట్‌లండన్‌ సిటీలోని ఒక నైట్‌ క్లబ్‌లో నేడు 17 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయం ఆదివారం తెల్లవారుజామున బయటకు వచ్చింది. ఈ

Updated : 26 Jun 2022 15:01 IST

ఇంటర్నెట్‌డెస్క్: దక్షిణాఫ్రికాలోని ఈస్ట్‌లండన్‌ సిటీలోని ఒక నైట్‌ క్లబ్‌లో నేడు 17 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయం ఆదివారం తెల్లవారుజామున బయటకు వచ్చింది. ఈ క్లబ్‌లో పలు ప్రదేశాల్లో మృతదేహాలు పడిఉన్నట్లు సమాచారం. మృతుల శరీరాలపై గాయాలు లేకపోవడంతో.. మరణానికి కారణాలు వెంటనే చెప్పలేమని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని చెబుతున్నారు. 

ఈ ఘటనపై ఈస్టర్న్‌ కేప్‌ పోలీసు ప్రతినిధి బ్రిగేడియర్‌ టెంబిన్‌కోసి కినాన స్పందిస్తూ ‘‘17 మంది మృతి చెందినట్లు  పోలీసులు ధ్రువీకరిస్తున్నారు. ఈ ఘటన ఈస్ట్‌లండన్‌లోని సీనరీ పార్క్‌లో చోటు చేసుకొంది. అక్కడున్న పరిస్థితులను అధ్యయనం చేస్తున్నాం. ఈ సమయంలో ఎటువంటి పుకార్లకు అవకాశం ఇవ్వం’’ అని పేర్కొన్నారు. మృతుల బంధువులు ఆ ప్రాంతానికి చేరుకొని తమ బిడ్డల మృతదేహాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మృతుల సంఖ్య 22 వరకు ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని