విమానంలో రూ.260కోట్ల నగదు.. కొట్టేసేందుకు ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చి..!
చిలీ (Chile)లో ఎయిర్‌పోర్టులో రూ.260కోట్ల నగదును ఎత్తుకెళ్లేందుకు ఓ ముఠా చేసిన మనీ హైయిస్ట్ (Money Heist) యత్నాన్ని పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు.
శాంటియాగో: విమానంలో తరలిస్తున్న భారీ మొత్తంలోని నగదు (Money)ను కొల్లగొట్టేందుకు ఓ ఘరానా దొంగల ముఠా విఫలయత్నం చేసింది. సినీ ఫక్కీలో ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చి డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఎయిర్‌పోర్టు (Airport) అధికారులు అప్రమత్తమవడంతో ఈ భారీ ‘మనీ హైయిస్ట్ (Money Heist)’ను అడ్డుకోగలిగారు. చిలీ (Chile) రాజధాని శాంటియాగోలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫ్లోరిడా (Florida)లోని మియామీ నుంచి 32.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్లకు పైనే) నగదును ప్రత్యేక విమానంలో బుధవారం చిలీకి తీసుకొచ్చారు. ఆ నగదును చిలీలోని పలు బ్యాంకులకు తరలించాల్సి ఉంది. శాంటియాగోలోని విమానాశ్రయంలో ఈ విమానం (Flight) దిగగానే అందులోని డబ్బును ఓ సాయుధ ట్రక్కులోకి తరలిస్తుండగా ఉన్నట్టుండి ఓ దొంగల ముఠా దాడి చేసింది. వాహనాలతో విమానాశ్రయ గేటును బద్దలుకొట్టి ఆ ముఠా రన్‌వేపైకి చొచ్చుకొచ్చింది.
అందులో కొందరు దొంగలు భద్రతా సిబ్బందిపై దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు పోలీసులు వెంటనే వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల ఘటనలో పౌరవిమానయాన ఉద్యోగి ఒకరు మృతిచెందగా.. నిందితుల్లో ఒకడు హతమయ్యాడు. మిగతవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన తర్వాత డబ్బు సురక్షితంగానే ఉందని అధికారులు వెల్లడించారు.
కాగా.. శాంటియాగో ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘరానా దోపిడీలు కొత్తేం కాదు. 2020లో ఓ దొంగల ముఠా.. ఎయిర్‌పోర్టులోని ఓ గోదాంలో ఉంచిన 15 మిలియన్ డాలర్ల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లింది. అంతకుముందు ఆరేళ్ల క్రితం కూడా 10 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP Employees: 160 డిమాండ్లతో ఏపీ సీఎస్‌కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతిపత్రం
-
Sports News
GT vs CSK: చెలరేగిన సుదర్శన్.. చెన్నై విజయలక్ష్యం 215
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి