బైడెన్‌ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు

దేశ రహస్య పత్రాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నివాసంలో ఎఫ్‌బీఐ బుధవారం దాడులు నిర్వహించింది.

Published : 02 Feb 2023 05:26 IST

రహస్య పత్రాల వ్యవహారం

వాషింగ్టన్‌: దేశ రహస్య పత్రాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నివాసంలో ఎఫ్‌బీఐ బుధవారం దాడులు నిర్వహించింది. రిహొబొత్‌ బీచ్‌ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో సోదాలు జరిగినట్లు అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాది వెల్లడించారు. తన నివాసంలో సోదాలు నిర్వహించేందుకు న్యాయ విభాగానికి అధ్యక్షుడు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. విల్మింగ్టన్‌లో ఉన్న బైడెన్‌ నివాసంలో జనవరి 20న 13గంటల పాటు సోదాలు నిర్వహించిన న్యాయ విభాగం అధికారులు కొన్ని రహస్య పత్రాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఆయన చేతి రాతతో ఉన్న కొన్ని పత్రాలను తీసుకెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు