ఉత్తర కొరియాలో మానవ హక్కుల హననం
ఉత్తర కొరియాలో గర్భిణులను, స్వలింగ సంపర్కులను ఉరితీస్తూ ఆ దేశం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని దక్షిణ కొరియా వెల్లడించింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆగడాలు మితిమీరుతున్నాయని పేర్కొంది.
స్వలింగ సంపర్కులతోపాటు చిన్న నేరాలకు పాల్పడిన వారికీ మరణ శిక్షలు
దక్షిణ కొరియా నివేదిక వెల్లడి
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియాలో గర్భిణులను, స్వలింగ సంపర్కులను ఉరితీస్తూ ఆ దేశం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని దక్షిణ కొరియా వెల్లడించింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆగడాలు మితిమీరుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు దక్షిణ కొరియా యునిఫికేషన్ మినిస్ట్రీ గురువారం 450 పేజీల నివేదికను వెలువరిచింది. ఉత్తర కొరియా ప్రజల జీవించే హక్కు పెనుప్రమాదంలో పడిందని, చట్టంలో లేని, మరణశిక్షకు అనర్హమైన కేసులకు సైతం ఉరిశిక్షలు విధిస్తున్నారని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. మతపరమైన కార్యకలాపాలకు యత్నించడం, మూఢనమ్మకాలు, డ్రగ్స్ వినియోగించడం, దక్షిణ కొరియాకు చెందిన వీడియోలను వీక్షించడం వంటి వాటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తూ మరణ దండన విధిస్తున్నారని పేర్కొంది. కిమ్ రాజ్యంలో కఠిన నిబంధనలను భరించలేక 2017-2022 మధ్య ఇతర దేశాలకు వలస వెళ్లిన 500 మంది ఉత్తర కొరియన్లను విచారించి దక్షిణ కొరియా ఈ నివేదిక వెలువరించింది. ‘‘ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ చిత్రపటాన్ని చూపిస్తూ నృత్యం చేసిన ఓ ఆరు నెలల గర్భిణిని బహిరంగంగా ఉరితీశారు. ఓ స్టేడియంలో ఆరుగురు టీనేజర్లు మత్తు మందు సేవించడంతోపాటు దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియోను చూస్తున్నారని వారిని కాల్చి చంపారు. స్వలింగ సంపర్కులు, మత కార్యక్రమాలు నిర్వహించేవారు, విదేశాలకు పారిపోయేందుకు యత్నించిన వారికీ ఉరిశిక్షలు విధిస్తున్నారు. దేశంలోని మరుగుజ్జుల జాబితాను తయారు చేయమని నర్సులపై పాలనా యంత్రాంగం ఒత్తిడి చేసింది. ఓ మరుగుజ్జు మహిళ గర్భాశయాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స చేయించింది. బలవంతంగా మానవ ప్రయోగాలూ నిర్వహిస్తున్నారు’’ అని దక్షిణ కొరియా నివేదిక వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: డ్రైవర్‌కు గుండెపోటు.. కారును ఢీకొట్టిన లారీ
-
India News
Manish Sisodia: ఆరోపణలు తీవ్రమైనవి.. బెయిల్ ఇవ్వలేం : సిసోదియాకు హైకోర్టు షాక్
-
Sports News
CSK vs GT: పరిస్థితి ఎలా ఉన్నా.. అతడి వద్ద ఓ ప్లాన్ పక్కా!
-
Crime News
Delhi: సాక్షి హంతకుడిని పట్టించిన ఫోన్‌కాల్..!
-
Movies News
Sonu sood: అనాథ పిల్లల కోసం.. సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్
-
India News
PM Modi: ‘నా ప్రతి నిర్ణయం.. మీ కోసమే’: మోదీ