3 నెలల్లో 14 శిఖరాలు అధిరోహించేందుకు యాత్ర

ప్రపంచంలోని 14 ఎత్తయిన పర్వతాలను మూడు నెలల్లోనే అధిరోహించి ప్రపంచ రికార్డును నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నార్వేకు చెందిన పర్వతారోహకురాలు క్రిస్టిన్‌ హరిల (37) తెలిపారు.

Published : 07 Jun 2023 04:21 IST

ఇప్పటికే ఎనిమిది పూర్తి  
నార్వే పర్వతారోహకురాలి ప్రయత్నం

కాఠ్‌మాండూ: ప్రపంచంలోని 14 ఎత్తయిన పర్వతాలను మూడు నెలల్లోనే అధిరోహించి ప్రపంచ రికార్డును నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నార్వేకు చెందిన పర్వతారోహకురాలు క్రిస్టిన్‌ హరిల (37) తెలిపారు. ఇందులో భాగంగానే నేపాల్‌లోని మనసులు పర్వతాన్ని అధిరోహించడానికి కాఠ్‌మండూ వచ్చిన ఆమె.. తన లక్ష్యం గురించి మంగళవారం మాట్లాడారు. ఇప్పటికి తన ప్రపంచయాత్ర మొదలై 40 రోజులు అయిందని, ఈ వ్యవధిలో 8 పర్వత శిఖరాలపై కాలు మోపినట్లు తెలిపారు. కొద్ది రోజుల్లో మనసులు పర్వతం.. తర్వాత పాక్‌లోని కే2 శిఖరాన్ని అధిరోహించాలని ప్రణాళిక వేసుకున్నట్లు వివరించారు. 2019లో ఓ పర్వతారోహకుడు ఆరు నెలల్లో 14 శిఖరాలను అధిరోహించి నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టడానికి ఈ యాత్ర ప్రారంభించానని హరిల పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని