ఫిలిప్పీన్స్‌ సార్వభౌమత్వానికి అండగా ఉంటాం : జైశంకర్‌

సార్వభౌమత్వ పరిరక్షణలో ఫిలిప్పీన్స్‌కు భారత్‌ పూర్తి అండగా నిలుస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు.

Updated : 27 Mar 2024 05:56 IST

మనీలా: సార్వభౌమత్వ పరిరక్షణలో ఫిలిప్పీన్స్‌కు భారత్‌ పూర్తి అండగా నిలుస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. రక్షణ, భద్రత సంబంధిత రంగాలు సహా అన్నింటా సహకారాన్ని విస్తరించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. దక్షిణ చైనా సముద్రంలో చైనాతో ఫిలిప్పీన్స్‌కు ఉన్న వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఫిలిప్పీన్స్‌ విదేశాంగ మంత్రి ఎన్‌రిక్‌ మనాలోతో భేటీ అనంతరం మనీలాలో మంగళవారం జైశంకర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతర్జాతీయ వ్యవహారాలు, రక్షణ, సముద్రయానం, వాణిజ్యం, పెట్టుబడులు సహా పలు అంశాలు రెండు దేశాల మధ్య చర్చకు వచ్చాయని చెప్పారు. నిబంధనల ప్రకారం నడిచే పాలనకు రెండు ప్రజాస్వామ్య దేశాలూ కట్టుబడి ఉన్నందువల్ల వివిధ రంగాల్లో మరింతగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని