మాల్దీవుల నుంచి రెండో బ్యాచ్‌ భారతీయ సైనికుల ఉపసంహరణ

మాల్దీవుల నుంచి మన దేశం రెండో బ్యాచ్‌ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది. ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Published : 15 Apr 2024 04:53 IST

మాలె: మాల్దీవుల నుంచి మన దేశం రెండో బ్యాచ్‌ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది. ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌ తమకు బహుమానంగా అందించిన డోర్నియర్‌ విమానానికి సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న సిబ్బంది ఈ నెల 9న దేశాన్ని విడిచి వెళ్లారని ముయిజ్జు తెలిపారు. అయితే ఎంతమంది సైనికులు వెళ్లిపోయారు, వారి స్థానంలో కొత్తగా పౌర సిబ్బందిని భారత్‌ నియమించిందా లేదా అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. చివరిదైన మూడో బ్యాచ్‌ అధికారులు కూడా ముందుగా నిర్దేశించుకున్న తుది గడువు (మే 10)లోగా వెనక్కి వెళ్లిపోతారని ఆయన పేర్కొన్నారు. మాల్దీవుల్లో మన దేశ సైనిక సిబ్బంది మొత్తం 88 మంది ఉండగా.. తొలి బ్యాచ్‌లో భాగంగా 26 మంది గత నెల 11న స్వదేశానికి చేరుకున్నారు. వారి స్థానంలో 26 మంది పౌర సిబ్బందిని మన దేశం అక్కడ మోహరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని