కోల్‌కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 20 Apr 2024 05:53 IST

కోల్‌కతా: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వేసవికాలం ముగిసే వరకు న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వడగాడ్పులు, ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ శివజ్ఞానం నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వేసవి సెలువులు ముగిసేవరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని