కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం

ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది.

Published : 30 Apr 2024 04:36 IST

నైరోబి: ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించి పలు నివాసాలు దెబ్బతిన్నాయి. రహదారి ధ్వంసమైంది. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే వందమందికి పైగా ప్రజలు మృతిచెందారు. వరదల కారణంగా 2 లక్షల మంది ప్రజలు స్థానిక పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు. వర్షాలు మరికొన్ని రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పాఠశాలలకు ఇచ్చిన మధ్యంతర సెలవుల్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. టాంజానియాలో కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడి ఆ దేశంలో ఇప్పటికే 155 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని