రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్‌వో

ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్‌ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

Published : 05 May 2024 04:53 IST

టెల్‌అవీవ్‌: ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్‌ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నగరంపై సైనిక దాడి.. రక్తపాతానికి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానమ్‌ ఘెబ్రియేసస్‌ హెచ్చరించారు. ఇప్పటికే దెబ్బతిన్న వైద్యవ్యవస్థ మరింత పతనమవుతుందని ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. రఫాపై దండయాత్ర మొదలైతే అక్కడి ప్రజలు మళ్లీ వలసబాట పట్టాల్సి ఉంటుందని, నిత్యావరాలు కూడా అందక వ్యాధులు ప్రబలుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో శరణార్థి శిబిరంపై దాడిలో ముగ్గురు చనిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని