ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే

దేశంలో మొత్తం 3 లోక్‌సభ, 7 శాసనసభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో పోలైన ఓట్లను ఆదివారం లెక్కించనున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహాతో పాటు... మరికొందరు అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Updated : 26 Jun 2022 05:43 IST

3 లోక్‌సభ, 7 శాసనసభ స్థానాల్లో వెల్లడి కానున్న ఫలితాలు

దిల్లీ: దేశంలో మొత్తం 3 లోక్‌సభ, 7 శాసనసభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో పోలైన ఓట్లను ఆదివారం లెక్కించనున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహాతో పాటు... మరికొందరు అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. దిల్లీతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను ఆ తర్వాత లెక్కపెడతారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరుతో పాటు... త్రిపురలోని అగర్తల, జుబరాజ్‌నగర్‌, సుర్మా, బర్దోవాలి (పట్టణ) నియోజకవర్గాలకూ; ఝార్ఖండ్‌లోని మందార్‌, దిల్లీలోని రాజిందర్‌నగర్‌ శాసనసభ స్థానాలకూ ఉపఎన్నికలు జరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌, ఆజాంగఢ్‌ ఎంపీ స్థానాలతో పాటు పంజాబ్‌లోని సంగ్రూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు నిర్వహించారు. త్రిపుర ముఖ్యమంత్రి పదవి నుంచి బిప్లవ్‌ దేవ్‌ తప్పుకోవడంతో.. ఎంపీగా ఉన్న మాణిక్‌ సాహా ఆ బాధ్యతలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బర్దోవాలి (పట్టణ) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన... ఉపఎన్నికల్లో విజయం సాధిస్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని