రష్యన్‌ గబ్బిలాల్లో కొత్త వైరస్‌

రష్యాలోని గబ్బిలాల్లో గుర్తించిన ‘ఖోస్టా-2’ అనే కొత్తరకం వైరస్‌.. కరోనా తరహాలో మనుషులకు సోకగలదని పరిశోధనల్లో తేలింది. కొవిడ్‌-19 కట్టడికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు వీటిపై పనిచేయవని వెల్లడైంది.

Published : 27 Sep 2022 04:44 IST

 మానవులకూ సోకే ప్రమాదం

వాషింగ్టన్‌: రష్యాలోని గబ్బిలాల్లో గుర్తించిన ‘ఖోస్టా-2’ అనే కొత్తరకం వైరస్‌.. కరోనా తరహాలో మనుషులకు సోకగలదని పరిశోధనల్లో తేలింది. కొవిడ్‌-19 కట్టడికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు వీటిపై పనిచేయవని వెల్లడైంది. ఈ కొత్త వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లకు మానవ కణాల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఉంది. యాంటీబాడీ థెరపీ, బ్లడ్‌ సీరం చికిత్సలూ దీనిపై ప్రభావం చూపబోవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2, ఖోస్తా-2లు కరోనా వైరస్‌లోని సార్బేకొవైరస్‌ అనే ఉపజాతికి చెందినవని వివరించారు. నిజానికి ఖోస్టా-1, ఖోస్టా-2 వైరస్‌లను రష్యాలోని గబ్బిలాల్లో 2020లోనే కనుగొన్నారు. వాటితో మనుషులకు ఎలాంటి ముప్పు ఉండదని తొలుత భావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని