బంగ్లాదేశ్‌ పడవ ప్రమాదంలో 50కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తర బంగ్లాదేశ్‌లోని పురాతన ఆలయానికి భక్తులతో బయలుదేరి.. పడవ బోల్తాపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 50కు చేరింది. అధికారులు సోమవారం మరో 25 మృతదేహాలను

Published : 27 Sep 2022 05:53 IST

ఢాకా: ఉత్తర బంగ్లాదేశ్‌లోని పురాతన ఆలయానికి భక్తులతో బయలుదేరి.. పడవ బోల్తాపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 50కు చేరింది. అధికారులు సోమవారం మరో 25 మృతదేహాలను వెలికి తీయించారు. దుర్గాపూజల ప్రారంభ సందర్భంగా అందరూ బోదేశ్వరి ఆలయానికి వెళుతుండగా ఆదివారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. పంచగఢ్‌ జిల్లా పరిధిలోని కొరొటోవా నదిలో పడవ బోల్తాపడింది. మృతుల్లో 25 మంది మహిళలు, చిన్నపిల్లలు 13, పురుషులు 12 మంది ఉన్నారు. ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు.. ప్రమాద సమయంలో పడవలో 150 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో చాలామంది ఈదుకొంటూ తీరానికి చేరారు. ఇంకా 34 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని