క్షేమంగా భూమికి చైనా వ్యోమగాములు

భూకక్ష్యలోని తమ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలల పాటు విధులు నిర్వర్తించిన ముగ్గురు చైనా వ్యోమగాములు ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చారు.

Published : 05 Dec 2022 04:56 IST

బీజింగ్‌: భూకక్ష్యలోని తమ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలల పాటు విధులు నిర్వర్తించిన ముగ్గురు చైనా వ్యోమగాములు ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చారు. షెంఝౌ-14 వ్యోమనౌక ద్వారా వీరు ఉత్తర మంగోలియాలోని డాంగ్‌ఫెంగ్‌ ల్యాండింగ్‌ సైట్‌లో కాలుమోపారు. జూన్‌ 5న రోదసిలోకి వెళ్లిన వీరు.. అంతరిక్ష కేంద్రంలో 183 రోజులు గడిపారు. ఈ క్రమంలో ఐదు వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియలను, మూడు స్పేస్‌వాక్‌లను నిర్వహించారు. అంతరిక్ష కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా సైన్స్‌పై ఉపన్యాసం కూడా ఇచ్చారు. అనేక సాంకేతిక ప్రయోగాలను నిర్వహించారు. వీరి స్థానంలో మరో ముగ్గురు వ్యోమగాములు గత నెల 29న షెంఝౌ-15 వ్యోమనౌక ద్వారా రోదసిలోకి పయనమయ్యారు. దీర్ఘకాలం అంతరిక్ష కేంద్రంలో నివసించడం వంటి అంశాలపై వీరు ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ నెలాఖరుకు తమ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చైనా భావిస్తోంది. అమెరికాతో పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో అంతరిక్ష కార్యకలాపాలను డ్రాగన్‌ ముమ్మరం చేస్తోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని