Joe Biden: ట్రంప్‌ మగ్‌షాట్‌ ఫొటో.. అందంగా ఉన్నారంటూ బైడెన్‌ సెటైర్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మగ్‌షాట్‌ తీయించుకుని చరిత్ర సృష్టించారు. దీంతో ఈ అంశంపై అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పందించారు. 

Updated : 26 Aug 2023 19:06 IST

వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలోనే మగ్‌షాట్‌ (Mug Shot) తీయించుకొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌  (Donald Trump) నిలిచారు. దీంతో అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ట్రంప్‌ మగ్‌షాట్‌ ఫొటోపై సెటైర్‌ వేశారు. తాహోలోని వ్యాయామ క్లాస్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘ట్రంప్‌ నిజంగా అందమైన, అద్భుతమైన వ్యక్తి’’ అని బైడెన్‌ సెటైర్‌ వేశారు. అయితే, ట్రంప్‌ జార్జియాలోని ఫుల్టన్‌ కౌంటీ జైల్లో ఉన్న సమయంలో బైడెన్‌ నిధుల సేకరణకు సంబంధించి ఈమెయిల్స్‌ను తన మద్దతుదారులకు పంపించారు. మనం ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు ఇంతకంటే మంచి రోజు ఇంకోటి లేదు అంటూ బైడెన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

తొలి చర్చతో మార్మోగిన వివేక్‌ పేరు

2020 అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంపు జార్జియాలోని ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయిన విషయం తెలిసిందే. పోలీసు రికార్డుల కోసం ఆయన ఫొటో (మగ్‌షాట్‌) తీశారు. దీంతో మగ్‌షాట్‌ తీయించుకున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆయనకు ఖైదీ నంబర్‌  P01135809 కేటాయించారు. అరెస్టు అయిన 20 నిమిషాల అనంతరం 2 లక్షల డాలర్ల పూచీకత్తుపై  ఆయన విడుదలయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని