Miss Venezuela: అంత్యక్రియలపై వీడియో.. ఆపై రెండు నెలలకే అందాల సుందరి మృతి

మిస్‌ వెనిజులా అరియానా వైరా.. మరణానంతరం తన అంత్యక్రియలు ఏ విధంగా నిర్వహించాలని వివరిస్తూ.. సరదాగా వీడియో పోస్టు చేసింది. ఇది పోస్టు చేసిన రెండు నెలలకే అందాల సుందరి ప్రాణాలు కోల్పోయింది.  

Published : 03 Aug 2023 18:06 IST

కారకస్‌: మరణానంతరం తన అంత్యక్రియలు ఏ విధంగా నిర్వహించాలని వివరిస్తూ.. సరదాగా వీడియో పోస్టు చేసింది వెనిజులా (Venezuela)అందాల సుందరి. వీడియో పోస్టు చేసిన రెండు నెలలలోనే ఆమె ఒక కారు ప్రమాదానికి గురయ్యింది. గాయాల నుంచి కోలుకున్న అనంతరం గుండెపోటుతో మరణించింది.

మిస్‌ వెనిజులా అరియానా వైరా ( Ariana Viera)(26) సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండేవారు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు తాను చేసే పనులను, ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకుంటూ ఉండేది. రెండు నెలల క్రితం సరదాగా తాను చనిపోతే అంత్యక్రియలు ఎలా చేస్తే బాగుంటుందో వివరిస్తూ ఒక వీడియో చేసింది. ‘‘నేను చనిపోతే నా అంత్యక్రియల కోసం దీన్ని రికార్డ్‌ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటివి నా దగ్గర నుంచి ఎవరూ తీసుకోరు’’అంటూ రాసుకొచ్చింది. వీడియో పోస్టు చేసిన కొన్ని రోజుల్లోనే ఆమె ఒక ప్రమాదానికి గురయ్యింది.

మంచు పర్వతాల్లో శవం ఆనవాళ్లు.. 37ఏళ్ల క్రితం మిస్‌ అయిన పర్వతారోహకుడిగా నిర్ధారణ!

జులై 13న ఓర్లాండ్‌ ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. కొన్నాళ్లు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కొంత కోలుకుంది. చివరికి గుండెపోటుతో మృతి చెందింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్టు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైరా చాలా రోజులుగా పనిచేయడం వల్ల అలసిపోయిందని.. అందుకే డ్రైవింగ్‌ చేస్తుండగా నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందని ఆమె తల్లి వివియన్ ఓచోవా స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. డొమినికన్‌ రిపబ్లిక్‌లో అక్టోబరులో జరగనున్న ‘‘మిస్‌ లాటిన్‌ అమెరికా ఆఫ్‌ ది వరల్‌-2023’’ పోటీలో వైరా తన దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని