Pakistan Elections: ‘అన్నా ఇది వన్డే కాదే.. టెస్ట్ మ్యాచ్‌లా ఉంది’.. పాక్‌ ఎన్నికలపై జోక్స్‌!

Pakistan Elections: పాకిస్థాన్‌ ఎన్నికల ఫలితాలు ఆలస్యమవుతుండటంపై పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో పాక్‌పై నెట్టింట ఫన్నీ మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Published : 10 Feb 2024 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల (Pakistan Elections) కౌంటింగ్‌ చేపట్టి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా ఫలితం తేలలేదు. అయినా, మాజీ ప్రధానులు నవాజ్‌ షరీఫ్‌, ఇమ్రాన్‌ఖాన్‌.. ఎవరికి వారే విజయాన్ని ప్రకటించుకుంటున్నారు. మరోవైపు, ఫలితాలు జాప్యమవడంతో.. అవకతవకలు జరుగుతున్నాయంటూ పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఇదే సమయంలో కొందరు నెటిజన్లు తమ టాలెంట్‌కు పని చెప్పారు. పాక్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఫన్నీ మీమ్స్‌ సృష్టించి దాయాదిపై సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.

పాకిస్థాన్‌లో నవాజ్‌ సంకీర్ణమే.. పొత్తుకు భుట్టో పార్టీ ఓకే..!

పాక్‌ ఎన్నికలపై నెట్టింట కొన్ని మీమ్స్‌, కామెంట్స్‌ ఇలా..

  • పాకిస్థాన్‌ సైన్యం ఇప్పటివరకు ఏ యుద్ధంలో గెలవలేదు. ఏ ఎన్నికల్లో ఓడిపోలేదు. వారి విజయ పరంపర తాజా ఎన్నికల్లోనూ కొనసాగుతోంది. (పాక్‌ రాజకీయాల్లో సైన్యం జోక్యాన్ని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ చేసిన పోస్ట్‌ ఇది)
  • పాక్‌లో కనీసం ఎన్నికల రోజుల్లోనైనా స్టార్‌లింక్‌తో ఇంటర్నెట్‌ ఇవ్వాలని ఎలాన్‌ మస్క్‌కు పిటిషన్‌ పెట్టాలి.
  • అన్నా ఇది వన్డే మ్యాచ్‌ కాదే.. టెస్ట్‌ మ్యాచ్‌
  • ఓటింగ్‌, కౌంటింగ్‌ ఎలా ఉన్నా.. చివరకు గెలిచేది మేమే కదా..!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని