Modi: నేలపై మువ్వన్నెల కాగితం.. మోదీ ఏం చేశారంటే..?

దక్షిణాఫ్రికా(South Africa) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(Modi) చర్య అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

Updated : 23 Aug 2023 17:14 IST

జొహన్నెస్‌బర్గ్‌: ప్రధాని నరేంద్రమోదీ(Modi) ప్రస్తుతం దక్షిణాఫ్రికా(South Africa)లో పర్యటిస్తున్నారు. 15వ బ్రిక్స్ సదస్సు కోసం ఆ దేశ రాజధాని జొహన్నెస్‌బర్గ్‌ ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం బ్రిక్స్‌(BRICS) దేశాల అధినేతలు గ్రూప్ ఫొటో దిగేందుకు వేదికపైకి వచ్చారు. ఆ సమయంలో ప్రధాని మోదీ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

గ్రూప్‌ ఫొటో దిగేందుకు వచ్చిన మోదీకి.. అక్కడ మన జాతీయ పతాక రంగులతో ఉన్న ఓ కాగితం కనిపించింది. తాము నిలబడే దగ్గర ఆ కాగితం ఉండటంతో ప్రధాని వెంటనే స్పందించారు. దానిని అక్కడి నుంచి తీసి, తన జేబులో వేసుకున్నారు. వెంటే ఉన్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా కూడా మోదీ మార్గాన్నే అనుసరించారు. అక్కడున్న కాగితాన్ని తీసి.. తన సహాయకులకు అందించారు. ప్లీనరీ సమావేశానికి ముందు ఈ సంఘటన జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని