- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Monkeypox: సురక్షితమైన బిడ్డకు జన్మనిచ్చిన ‘మంకీపాక్స్’ బాధితురాలు!
వాషింగ్టన్: ప్రపంచంలో మంకీపాక్స్(Monkeypox) కేసులు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సైతం ఇటీవల ఈ వ్యాధిని ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’గా ప్రకటించింది. మరోవైపు.. ఈ వైరస్‌పై ఇప్పటివరకు సమాచారం తక్కువే ఉండటంతో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో మంకీపాక్స్ సోకిన ఓ గర్భిణి.. ఆరోగ్యమంతమైన శిశువుకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ ఇద్దరూ సురక్షితంగానే ఉన్నారని సీడీసీ(CDC) తెలిపినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. సీడీసీకి చెందిన వైద్యుడు డా.జాన్ బ్రూక్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వైరస్ బారిన పడకుండా శిశువుకు ‘ఇమ్యూనోగ్లోబులిన్’ చికిత్స అందించినట్లు చెప్పారు.
ఇదివరకు మంకీపాక్స్ వ్యాప్తి చెందిన సమయంలో వైరస్ సోకిన గర్భిణుల నుంచి శిశువులకు వ్యాధి సోకిన దాఖలాలు ఉన్నాయని.. అయితే, ఈసారి శిశువుకు వైరస్ సోకినట్లు కనిపించలేదని బ్రూక్స్ తెలిపారు. మంకీపాక్స్ వ్యాప్తి సమయంలో యాంటీబాడీ చికిత్సగా ‘ఇమ్యూనోగ్లోబులిన్’ అందించడానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. సీడీసీ సమాచారం ప్రకారం.. మంకీపాక్స్ ద్వారా గర్భిణులకు తీవ్రమైన ముప్పు అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. మంకీపాక్స్ కేసులు అత్యధికంగా స్పెయిన్‌లో 3,596 ఉండగా.. భారత్‌లోనూ ఇప్పటివరకు నాలుగు కేసులు వెలుగు చూశాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Liger: ‘లైగర్’ సినిమా.. ఏడు అభ్యంతరాలు చెప్పిన సెన్సార్ బోర్డ్
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Thiru review: రివ్యూ: తిరు
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Jammu: ఉగ్రవాది అతితెలివి.. ఎన్కౌంటర్ చేసిన పోలీసులు
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం