Columbia University: అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు

Columbia University: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా విద్యార్థులు చేస్తున్న నిరసనలను పోలీసులు క్రమంగా అదుపులోకి తీసుకొస్తున్నారు. తాజాగా కొలంబియా వర్సిటీలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 01 May 2024 10:05 IST

న్యూయార్క్‌: కొలంబియా విశ్వవిద్యాలయంలో (Columbia University) నిరసనలు అదుపులోకి వచ్చాయి. గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధంపై అమెరికా అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ పాలస్తీనా మద్దతుదారులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చటంతో పోలీసులు రంగంలోకి దిగారు. 12 గంటలుగా హామిల్టన్‌ హాల్‌లో బైఠాయించిన నిరసనకారులను మంగళవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు వర్సిటీ (Columbia University) యాజమాన్యం నిరసనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. మరో మార్గంలో తమ ఆందోళనలను తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది. పెడచెవిన పెట్టటంతో చేసేదిలేక పోలీసులను పిలిపించింది. చర్యలు తీసుకునేందుకు అనుమతించింది. దీంతో నిరసనలు, పోలీసుల అరెస్టులతో క్యాంపస్‌ కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది.

మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్‌ దాడులపై ఐరాస ఆందోళన

కొన్ని రోజుల క్రితం కొలంబియా వర్సిటీలో ప్రారంభమైన ఈ నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే. వివిధ విశ్వవిద్యాలయాల్లోని పాలస్తీనా మద్దతుదారులు ఆందోళనలు దిగారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,000 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం.

నిరసనల్లో భాగంగా కొంతమంది అకాడమిక్‌ బిల్డింగ్‌లను ఆక్రమించారు. దీన్ని శ్వేతసౌధం తీవ్రంగా తప్పుబట్టింది. ఇది శాంతియుత ప్రదర్శన కాదని తెలిపింది. ఇప్పటి వరకు నార్తర్న్ కాలిఫోర్నియా క్యాంపస్‌లో 1 మిలియన్‌ డాలర్ల నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని