Israel Hamas: ఇజ్రాయెల్‌ స్వీయ రక్షణకు పూర్తి మద్దతు: రిషి సునాక్‌

హమాస్‌తో యుద్ధం కొనసాగుతోన్న వేళ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ భేటీ అయ్యారు.

Published : 19 Oct 2023 18:09 IST

టెల్‌ అవీవ్‌: తనను తాను రక్షించుకోవడంతోపాటు హమాస్‌ (Hamas)ను వేటాడే విషయంలో ఇజ్రాయెల్‌ (Israel)కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) ప్రకటించారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ మిలిటెంట్ల మధ్య పోరు (Israel Hamas Conflict) కొనసాగుతోన్న వేళ రిషి సునాక్‌ గురువారం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Netanyahu)తో భేటీ అయ్యారు. మధ్య ఆసియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రిషి సునాక్‌ నేడు ఇజ్రాయెల్‌ చేరుకున్నారు.

అనంతరం రిషి సునాక్‌ మాట్లాడుతూ.. ‘హమాస్‌ మాదిరి కాకుండా.. పౌరులకు ఎటువంటి హాని కలగకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుసు. పాలస్తీనియన్లు కూడా హమాస్ బాధితులే. ఈ క్రమంలోనే మానవతా సాయానికి అనుమతి ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషం’ అని ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఓ స్నేహితుడిలా మీతో నిలబడతానని, ఇజ్రాయెల్‌ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు రిషి సునాక్‌ తెలిపారు.

‘కాఫీ, కుకీలు ఇచ్చి.. హమాస్‌ మిలిటెంట్లను ఏమార్చి..!’

అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) కూడా ఇజ్రాయెల్‌ వచ్చారు. హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ చేస్తోన్న పోరుకు అగ్రరాజ్యం మద్దతుగా నిలుస్తుందనే విషయాన్ని చెప్పడానికి ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టినట్లు స్పష్టం చేశారు. బైడెన్‌ పర్యటన ముగించుకొని వెళ్లిన పోయిన తర్వాత హమాస్ రాకెట్ల వర్షం కురిపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని