Russia: రష్యా సూపర్‌సానిక్‌ లాంగ్‌రేంజి బాంబర్‌ ధ్వంసం..!

రష్యాకు చెందిన లాంగ్‌రేంజి వ్యూహాత్మక బాంబర్‌ను ఉక్రెయిన్‌ డ్రోన్‌ ధ్వంసం చేసింది. ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని వైమానిక స్థావరంలో ఈ దాడి చోటు చేసుకొంది.

Published : 23 Aug 2023 10:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా(Russia)లోని కీలక స్థావరాలపై ఉక్రెయిన్‌ (Ukrain) డ్రోన్లు డాడులు చేసి భారీ నష్టాలను కలిగిస్తున్నాయి. తాజగా రష్యాకు చెందిన సూపర్‌ సానిక్‌ విమానాలుండే షైకోవ్కా స్థావరంపై భారీగా బాంబింగ్‌ జరిగింది. ఇది ఉక్రెయిన్‌ సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత వారాంతంలో నోవ్‌గ్రోడ్‌లోని స్లాట్సీ మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్‌ పై కూడా దాడి జరిగినట్లు రష్యా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పలు వరసల్లోని రష్యా రక్షణ వ్యవస్థలను దాటుకొని వచ్చి ఉక్రెయిన్‌ డ్రోన్లు ఈ దాడులు చేయడం గమనార్హం. 

షైకోవ్కా స్థావరం నుంచి రష్యా తపలోవ్‌ టీయూ-22ఎం3 సూపర్‌సానిక్‌ లాంగ్‌ రేంజి బాంబర్లను ఆపరేట్‌ చేస్తోంది. ఇవి తరచూ ఉక్రెయిన్‌లోని లక్ష్యాలను సుదూరం నుంచి ఛేదించేలా కేహెచ్‌-22 క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా తాము చేసిన దాడిలో కనీసం ఒక రష్యా లాంగ్‌రేంజి బాంబర్‌ విమానం ధ్వంసమైపోయిందని ఉక్రెయిన్‌ ప్రతినిధి ఆండ్రీ యూసోవ్‌ పేర్కొన్నారు. ఈ దాడిని అత్యంత సమన్వయంతో నిర్వహించినట్లు వెల్లడించారు. రష్యా అంతర్గత భూభాగాల నుంచే వివిధ పనులను తాము చక్కబెడుతున్నట్లు ఆయన చెప్పారు. ‘‘ఉక్రెయిన్‌ డ్రోన్‌ అక్కడ ఉదయం 8 గంటల సమయంలో ల్యాండ్‌ అయింది’’ అని పేర్కొన్నారు.  సాధరణ పౌరులు ఉపయోగించే కాప్టర్‌కు ఐఈడీని అమర్చి బ్యాటరీ సాయంతో దానిని పేల్చినట్లు తెలుస్తోంది. 

భవిష్యత్తుకు దిక్సూచి ‘బ్రిక్స్‌’

రష్యా అత్యంత శక్తిమంతమైన వ్యూహాత్మక బాంబర్లను మోహరించిన ఈ ప్రాంతంపై వారం వ్యవధిలో జరిగిన రెండో దాడి ఇది. నోవ్‌గ్రోడ్‌లోని స్లాట్సీ మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్‌పై జరిగిన దాడిలో కూడా ఓ విమానం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఉక్రెయిన్‌ దాడుల్లో చాలా రష్యా వాయుసేన స్థావరాలు దెబ్బతిన్నాయి. వీటిల్లో రెండు లాంగ్‌రేంజి బాంబర్లు కూడా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని