Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!
దాదాపు 54 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాస్ (Ross) అనే 71 ఏళ్ల వ్యక్తి బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. డిగ్రీ పట్టా సాధించేందుకు ఒక వ్యక్తి ఇంత ఎక్కువ సమయం తీసుకోవడం యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా చరిత్రలోనే ఇది తొలిసారి.
అట్టావా: బ్యాచిలర్ డిగ్రీ సాధించేందుకు సాధారణంగా మూడు నాలుగేళ్లు పడుతుంది. కొన్ని ప్రత్యేక కోర్సుల్లో అయితే ఓ ఐదారేళ్లు పట్టొచ్చు. కానీ, కెనడాకి చెందిన రాస్ అనే 71 ఏళ్ల వ్యక్తి డిగ్రీ కోసం ఏకంగా 54 ఏళ్లపాటు నిరీక్షించారు. తాజాగా ఆయనకు బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ అందిస్తున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (యూబీసీ) వెల్లడించింది. డిగ్రీ పట్టా సాధించేందుకు ఒక వ్యక్తి ఇంత ఎక్కువ సమయం తీసుకోవడం యూనివర్సిటీ చరిత్రలోనే ఇది తొలిసారి. ఆ విధంగా ప్రపంచంలోనే అత్యంత నెమ్మదైన విద్యార్థిగా రాస్ రికార్డు సృష్టించినట్లయింది.
రాస్.. 1969లో యూబీసీలో చేరారు. యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాస్ తొలుత ఇంగీష్‌లో డిగ్రీ సాధించాలని యూబీసీలో చేరారు. అయితే, రెండో ఏడాదిలో ఉన్నప్పుడు ఆయన దృష్టంతా సినిమా నిర్మాణం వైపు మళ్లింది. ఎక్కువ సమయం థియేటర్ విభాగంలోనే గడిపేవారు. ఏవో షోలు చేస్తూ, దానిపైనే వివిధ కోర్సులు చేస్తూ ఉండేవారు. క్రమంగా నటుడిగా మారాలనేది ఆయన లక్ష్యం. అలా రెండేళ్లు పూర్తయ్యాయి. బ్యాచ్‌లర్ డిగ్రీ చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టిన రాస్.. మాంట్రియల్‌లోని నేషనల్ థియేటర్ స్కూల్ ఆఫ్ కెనడాలో మూడేళ్ల కోర్సును పూర్తి చేసేందుకు వెళ్లాడు. అయితే, అక్కడ రాణించలేకపోయారు. వ్యతిరేక ఫలితాలు రావడంతో ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత 1975లో టోరంటోలోని న్యాయ కళాశాలలో న్యాయకోర్సులో చేరారు. మూడేళ్లలో డిగ్రీ పొంది.. దాదాపు 35 ఏళ్లపాటు న్యాయవాదిగా సేవలందించారు. 2016లో పదవీ విరమణ పొందారు.
ఉద్యోగ విరమణ చేసిన రాస్.. నవంబరు 2016లో మరోసారి యూబీసీని సంప్రదించారు. 2017 జనవరి నాటికి ఆయనకు కొత్త ఐడీ నెంబరు వచ్చింది. దీంతో గతంలో నిలిచిపోయిన కోర్సును కొనసాగించే అవకాశం వచ్చింది. తాజాగా అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణత సాధించడంతో యూబీసీ ఆయను డిగ్రీ ప్రదానం చేసింది. తనకు ఎక్కువ వయస్సు ఉన్నప్పటికీ విద్యార్థులు తమలో ఒకడిగా భావించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని చెబుతారు రాస్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘ నాకు చదువు అంటే ఆసక్తి అందుకే బీఏ కోర్సులో చేరాను. నేర్చుకోవాలన్న ఆ కోరిక వల్లే ఇన్నేళ్లయినా డిగ్రీ పూర్తి చేయకుండా వదల్లేదు’ అని నవ్వుతూ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Zoleka Mandela: నెల్సన్ మండేలా మనవరాలు కన్నుమూత
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్