మూడు కుటుంబాలు.. 27 మందికి కరోనా

తాజా వార్తలు

Updated : 01/04/2021 18:33 IST

మూడు కుటుంబాలు.. 27 మందికి కరోనా

మల్లాపూర్‌: జగిత్యాల జిల్లా సిరిపూర్‌లో కరోనా కలకలం రేగింది. మూడు కుటుంబాలకు చెందిన 27 మందికి కొవిడ్‌ సోకింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సిరిపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పది రోజుల క్రితం మరణించాడు. మృతుడి కుటుంబసభ్యులు ఇవాళ దశదినకర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో 27 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి రాకేశ్ తెలిపారు. గత రెండు రోజులుగా గ్రామంలో కేసులు పెరుగుతుండటంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి 37 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 27 మందికి కరోనా వచ్చినట్లు తేలింది. ఈ మేరకు పాజిటివ్ వచ్చిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించినట్లు వైద్యాధికారి వెల్లడించారు. వీరంతా దగ్గర బంధువులు కావడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని