సైకిల్స్‌ ఫర్‌ ఛేంజ్‌ పోటీలో వరంగల్‌కు పురస్కారం

ప్రధానాంశాలు

సైకిల్స్‌ ఫర్‌ ఛేంజ్‌ పోటీలో వరంగల్‌కు పురస్కారం

దేశంలోని 11 నగరాల్లో ఒకటి

ఈనాడు, హైదరాబాద్‌: సైకిల్స్‌ ఫర్‌ ఛేంజ్‌ పోటీ(ఛాలెంజ్‌)లో వరంగల్‌ నగరం పురస్కారం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఒకటిగా నిలిచి.. రూ.కోటి నగదు బహుమతి సొంతం చేసుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన ఈ పోటీలో దేశవ్యాప్తంగా 107 నగరాలు పాల్గొన్నాయి. వరంగల్‌, హైదరాబాద్‌ సహా మొత్తం 25 నగరాలు రెండో దశకు ఎంపికయ్యాయి. వీటిలో 11 నగరాలు పురస్కారాలు సాధించగా.. మరో నాలుగు నగరాలు ప్రత్యేక జ్యూరీ విభాగంలో ఎంపికయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వరంగల్‌, బెంగళూరు మాత్రమే మొదటి 11 స్థానాల్లో నిలిచాయి. వరంగల్‌లో సైకిళ్ల వినియోగానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, వృద్ధులు సురక్షితంగా సైక్లింగ్‌ చేసేలా ర్యాలీలు నిర్వహించడం, సైక్లింగ్‌ ప్రోత్సాహానికి పిల్లలకు పోటీలు, విద్యార్థులకు, మహిళలకు వివిధ కార్యక్రమాలు చేపట్టారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పేర్కొంది. కాజీపేట నుంచి హన్మకొండ వరకు 4 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా ప్రత్యేకంగా సైకిల్‌ ట్రాక్‌ను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది.

మరిన్ని నగరాలు, పట్టణాల్లోనూ ప్రోత్సహించాలి: కేటీఆర్‌

ఆరోగ్యకరమైన జీవనశైలినిప్రోత్సహించడం, పర్యావరణ హితం వంటి అంశాల ప్రాతిపదికగా వరంగల్‌ నగరంలో సైక్లింగ్‌కు వీలుగా చక్కటి మార్గాలు ఏర్పాటు చేశారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. రాష్ట్రంలోని మరిన్నిపట్టణాలు, నగరాల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించాలనిమంత్రి ఆకాంక్షించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని