వికటించిన మధ్యాహ్న భోజనం

ప్రధానాంశాలు

వికటించిన మధ్యాహ్న భోజనం

వంద మంది విద్యార్థులకు అస్వస్థత

పాఠశాలలో వాంతులు చేసుకుంటున్న విద్యార్థులు

బీర్కూర్‌, న్యూస్‌టుడే: మధ్యాహ్న భోజనం వికటించి వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల పరిషత్‌ బాలికల ప్రాథమిక పాఠశాలలో బుధవారం చోటుచేసుకొంది. పాఠశాలలో మొత్తం 321 మంది చిన్నారులు చదువుతుండగా బుధవారం 264 మంది హాజరయ్యారు. వారికి మధ్యాహ్న సమయంలో అన్నం, పప్పుచారు, గుడ్డుతో భోజనం పెట్టారు. మూడు గంటల సమయంలో తరగతి గదుల్లోంచి ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి వంద మందికిపైగా విద్యార్థులు వాంతులు చేసుకొన్నారు. పీహెచ్‌సీ సిబ్బంది అక్కడకు ప్రాథమిక చికిత్స అందించారు. విషయం తెలిసి పాఠశాలకు పెద్దసంఖ్యలో తరలి వచ్చిన తల్లిదండ్రులు  మీ నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందంటూ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. అస్వస్థతకు గురైన చిన్నారులను అంబులెన్సుల్లో బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని