సైకిల్‌ ధీరల సాహస ప్రయాణం
close
Updated : 08/08/2021 05:39 IST

సైకిల్‌ ధీరల సాహస ప్రయాణం

ఈ ఇద్దరు సైకిల్‌పెడల్‌పై కాలుమోపారంటే రాష్ట్ర సరిహద్దులు దాటిపోవాల్సిందే. వేల కిలోమీటర్ల దూరం పూర్తి చేయాల్సిందే.. వయసుతో పనిలేదు... వేగానికి హద్దు లేదు అంటూ... దేశంలోనే అత్యంత పొడవైన రహదారులను సైకిల్‌పై ఒకరు చుట్టేస్తే, మరొకరు ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రాంతం ఖర్‌డంగ్‌ లా వరకు సైకిల్‌పై వెళ్లొచ్చారు. వారే... బెంగళూరుకు చెందిన 44 ఏళ్ల డాక్టర్‌ మీరా హర్షద్‌ వేలంకర్‌, హరియాణాకు చెందిన 31 ఏళ్ల ప్రీతి తనేజా. వారెందుకిదంతా చేస్తున్నారో చూడండి...

డాక్టర్‌ మీరా హర్షద్‌ వేలంకర్‌ లైఫ్‌ సైన్సెస్‌లో రిసెర్చి సైంటిస్ట్‌. పీహెచ్‌డీ చేసిన మీరా చదువంతా ముంబయిలోనే సాగింది. ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లిన తను, 2011లో భర్త, ఇద్దరు పిల్లలతో బెంగళూరుకు తిరిగొచ్చారు. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఉన్న ఆసక్తి తనను తిరిగి అటువైపు అడుగులేసేలా చేసింది. సైక్లింగ్‌ను ప్రారంభించిన ఈమె, అందులో పోటీలతో పాటు మారథాన్‌, ట్రైయథ్లాన్‌, అవుట్‌డోర్‌ అడ్వంచర్స్‌లో పాల్గొంటున్నారు. 2015లో టాండమ్‌ బైక్‌ రైడ్‌లో 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, అలాగే ముగ్గురితో కలిసి ట్రైయథ్లాన్‌ చేసి దేశంలోనే తొలిమహిళగా నిలిచి, లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానాన్ని సంపాదించారీ పెడల్‌ మమ్మీ.

తొలి మహిళగా... తాజాగా మీరా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అతి తక్కువ రోజుల్లో అతి పెద్ద జాతీయ రహదారిని ‘టాండమ్‌ సైకిల్‌’పై ప్రయాణించి దేశంలోనే ఇలా చేసిన తొలి మహిళా సైక్లిస్ట్‌గా నిలిచారు. ‘అతి పొడవైన రహదారుల్లో ఒకటైన కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌పై చుట్టేసి, గతేడాది నా చిరకాల ఆశయాన్ని నెరవేర్చుకున్నా. ఈ ఏడాది మెట్రో నగరాలను కలిపే గోల్డెన్‌ క్వాడ్రిలేట్రల్‌ జాతీయ రహదారిపై ప్రయాణాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నా. మరో సైక్లిస్టుతో కలిసి జూన్‌19న ముంబయి నుంచి మొదలుపెట్టి, జులై 31కల్లా మొత్తం 6,263 కి.మీ దూరాన్ని కేవలం 41 రోజుల్లో పూర్తి చేయగలిగా. తీవ్రమైన ఎండకు తట్టుకోలేక, శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యేది. దాంతో రాజస్థాన్‌ నుంచి రాత్రి పూట సైకిల్‌ తొక్కుతూ, పగలు విశ్రాంతి తీసుకునేదాన్ని. ఝార్ఖండ్‌లో కొన్ని మైళ్ల దూరమున్న రహదారుల్లో ఒక్కరు కూడా కనిపించకపోయేసరికి భయమేసేది. ఎండకు టైర్లు పంక్చరయ్యేవి. ఇవేవీ నాకు పెద్ద ఇబ్బందుల్లా అనిపించలేదు. మన దేశంలో అతి తక్కువ రోజుల్లో గోల్డెన్‌ క్వాడ్రిలేట్రల్‌ను పూర్తిచేసిన తొలి మహిళగా నిలవడం గర్వంగా ఉంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచే సైక్లింగ్‌పై అందరికీ అవగాహన కలిగించాలనే, ఈ తరహా ఛాలెంజ్‌లను తీసుకుంటున్నా’ అని వివరించారు డాక్టర్‌ మీరా.

ప్రీతి తనేజా...   కర్నల్‌ జిల్లాకు చెందిన ఈమె తండ్రి బ్యాంకు ఉద్యోగి, తల్లి గృహిణి. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ప్రీతి అయిదేళ్లక్రితం సైకిల్‌ నేర్చుకోవడం ప్రారంభించింది. రోజుకి 15 నుంచి 30 కిలోమీటర్ల దూరం సైకిల్‌ తొక్కడం సాధన చేసేది. క్రమేపీ ఆ దూరాన్ని పెంచుకుంటూ వెళ్లింది. తర్వాత అప్పుడప్పుడు 100, 200 కి.మీ దూరాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని ప్రయాణించేది. ఈ అభిరుచిలో భాగంగానే ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రాంతమైన ఖర్‌డంగ్‌లా కు వెళ్లాలనుకుంది. ఈ ఏడాది జూన్‌ 26న మనాలీ నుంచి బయలుదేరి, ఎనిమిది రోజుల్లో అంటే జులై మూడు కల్లా అక్కడకు చేరుకోగలిగింది. 17,982 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లడానికి 550 కి.మీ దూరం సైకిల్‌ తొక్కిందీమె. ‘మార్గ మధ్యంలో రోథంగ్‌పాస్‌, నకీలాపాస్‌, లాచుంగ్లా లా వంటి మంచు ప్రాంతాల్లో సెకిల్‌ తొక్కడం సాహసంగా అనిపించింది. మనుష్య సంచారం అంతంత మాత్రమే. అయినా నా ప్రయాణం ఆగలేదు. నా తదుపరి లక్ష్యం ఎవరెస్టు బేస్‌ క్యాంపు’ అని అంటోంది ప్రీతి.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని