లాక్‌డౌన్‌... నాకెంతో నేర్పింది
close
Published : 11/08/2021 02:16 IST

లాక్‌డౌన్‌... నాకెంతో నేర్పింది

నాలుగు భాషల్లో కథానాయిక, ప్రత్యేక గీతాల్లోనూ ఉర్రూతలూగిస్తున్న తమన్నా వెబ్‌ సిరీసుల్లోనూ సత్తా చాటుతోంది. ఇప్పుడు టీవీ రంగంలోనూ కాలుమోపుతోన్న తమన్నా వసుంధరతో ప్రత్యేకంగా మాట్లాడింది... తన ఆలోచనలను పంచుకుంది...

తెలుగమ్మాయినే: దక్షిణ భారతీయ భాషలన్నింటిలో చేసినా నాకు గుర్తింపు ఇచ్చింది తెలుగు సినిమాలే. అందుకేనేమో ప్రపంచమంతా నన్ను తెలుగు అమ్మాయిగానే గుర్తిస్తారు.

స్ఫూర్తి: మాధురి దీక్షిత్‌ని చూసి సినిమాల్లోకి రావాలనుకున్నా. కానీ స్ఫూర్తి రంగంలో అడుగుపెట్టేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆపై మనకు మనమే ప్రేరణ పొందాలి. నేను చేసే సినిమాల్లోని పాత్రల ద్వారానే స్ఫూర్తి పొందుతూ వచ్చాను.
వైవిధ్య ప్రయాణం: బహుభాషల్లో చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు, ఫిట్‌నెస్‌ వీడియోలు, ఇప్పుడు టీవీ షో... ఏదీ ప్రణాళిక వేసుకుని చేయను. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటా. సినిమాల్లోనూ ఇంత దూరం వస్తానని అనుకోలేదు. సీనియర్లతో పాటు యువ నటులతోనూ చేస్తున్నా. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి... దానికి అనుగుణంగా కొత్త వేదికల్లో అడుగుపెట్టా. కానీ ఏ రంగంలోనైనా వైవిధ్యం ఉండేలా చూసుకుంటా.
పదేళ్ల తర్వాత: 16ఏళ్లకు ముందు ఇలా ఉంటానని ఊహించలేదు. అవకాశాలు వచ్చాయి. అలానే ఏ రంగంలోనైనా మనసు పెట్టి పని చేస్తే అదే మనల్ని అక్కున చేర్చుకుంటుంది.
తెలుగు వంటలు : మా ఇంట్లో అందరికీ పూత రేకులు, ఆవకాయ అంటే చాలా ఇష్టం. ముంబయిలో మా స్నేహితులను కలిసేందుకు వెళ్తే హైదరాబాద్‌ బిర్యానీ తీసుకెళ్తా. అది వాళ్లకు బాగా నచ్చుతుంది. ఇప్పుడీ మాస్టర్‌ చెఫ్‌ కార్యక్రమం వల్ల మరెన్నో ప్రాంతీయ వంటకాలపై ఇష్టం పెంచుకున్నా.
ఎంచుకునే ఛాన్స్‌: ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనిదే జీవితం. సినిమాలు కూడా నేను ఎంచుకోలేదు. యాదృచ్ఛికంగా జరిగింది. సినిమాల్లోకి వస్తానని, రాణిస్తానని ఊహించనే లేదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం సాధించినట్లే.
పుస్తకమా!: ఆనందం, బాధ... ఇలా నన్ను కదిలించిన సందర్భాలు ఎదురైనప్పుడు, సమయం దొరికితే కవితలు రాస్తుంటా. ఇప్పటి వరకు ఎన్ని రాశానో లెక్క పెట్టలేదు. పుస్తక రూపం ఇవ్వాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదు.
ఇక ముందూ సేవ: లాక్‌డౌన్‌లో రోజుకు ఒక పూట కూడా తిండి దొరకని వారెందరినో చూశా. అటువంటి నిరుపేదలకు సాయం చేయాలని ‘లెట్స్‌ ఆల్‌ హెల్ప్‌’ స్వచ్ఛంద సంస్థతో పని చేశా. నా పరిచయాలతో పది మందికి సాయం అందించాలని చేసిన ప్రయత్నం వేల మందికి మేలు చేసింది. ఇక ముందూ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తా. దాతృత్వం ఉన్న వారు సమాజంలో ఎందరో ఉన్నారు.

అమ్మానాన్నల ముద్దుల కూతురు

లాక్‌డౌన్‌... నాకెంతో నేర్పింది. ఇంట్లో వాళ్లతో ఇంతకాలం ఎప్పుడూ గడపలేదు. ఆ అవకాశం లాక్‌డౌన్‌ వల్ల వచ్చింది. అమ్మానాన్నలతో గడపటం వల్ల మా మూలాలేమిటో తెలుసుకునే సమయం దొరికింది. వంటలతో మన సంస్కృతి ఏమిటో తెలుస్తోంది. మా అమ్మమ్మ లేకున్నా ఆమె చేసిన వంటల గురించి అమ్మ చెబుతుంటే చాలా ఆసక్తిగా అనిపించింది. మన సంప్రదాయాలను రోజూ గుర్తు చేసేవే వంటలు. మాస్టర్‌ చెఫ్‌ వల్ల వంటలపై మరింత పరిశోధన చేసే అవకాశం దక్కింది.
కరోనా: నేను మామూలుగానే ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉంటా. కానీ కరోనా ఎవరినీ విడిచిపెట్టదు కదా. నాకూ వచ్చింది. పౌష్టికాహారం, మానసిక దృఢత్వం నేను త్వరగా కోలుకునేలా చేశాయి. ఆహారం, శుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం నేర్పింది. తగ్గింది కదా అనుకుని అశ్రద్ధ చేయకండి. ప్రతి ఒక్కరూ విధిగా అన్ని జాగ్రత్తలనూ పాటించండి.
అన్న కాదు మార్గదర్శి: మా అన్నయ్య ఆనంద్‌ డాక్టర్‌. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. నా జీవితంలో తనది ప్రత్యేక స్థానం. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా తొలి ఫోను వెళ్లేది ఆనంద్‌కే. కరోనా వచ్చిందని తెలియగానే ఆనంద్‌కే ముందు ఫోను చేశా. తను అన్నగా కంటే ఓ స్నేహితుడిలా, మార్గదర్శిగా ఉంటాడు. రాఖీ పండగ వస్తోంది కదా... వీలైనంత త్వరగా ఒక మంచి రాఖీ కొని తనకు పంపాలి.

అన్నయ్య డాక్టర్‌ ఆనంద్‌తో...

- కె.ముకుంద, బెంగళూరు

 మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని