ఇంట్లో ఉంటేనేం...?
close
Published : 08/09/2021 01:09 IST

ఇంట్లో ఉంటేనేం...?

సౌమ్య కాలేజీలో చదివేటప్పుడు సొంతంగా ఏదైనా చేయాలని కలలు కనేది. పెళ్లికావడంతో ఆమె ఆలోచనలకు బ్రేక్‌ పడింది. 30 ఏళ్ల నిధి పిల్లల ఆలనాపాలనా కోసం ఉద్యోగానికి విరామం ఇచ్చింది. ఇక 55 ఏళ్ల రమణికి ఆమె పిల్లలు ఉద్యోగం చేసే స్థాయికెదిగారు. ఈ ముగ్గురిదీ ఒకటే ఆలోచన. అదేంటంటే... తమ చేతిలో మిగులుతున్న విలువైన సమయాన్ని మనసుకు నచ్చినట్లుగా మార్చుకోవాలని. ఇటువంటి వారి కోసం నిపుణులు పలు మార్గాలు సూచిస్తున్నారు... 

అభిరుచి
బాల్యంలో ఉండే అభిరుచులనే కెరీర్‌గా మలచుకోవచ్చు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ వంటివి తెలిసి ఉంటే ముందుగా మీ చీరలు, బ్లౌజులు, పిల్లల దుస్తులపై కుట్టి చూడండి. సోషల్‌ మీడియాను మీ డిజైన్ల ప్రదర్శనకు వేదికగా మార్చుకోవచ్చు. నలుగురికీ మీ నైపుణ్యం తెలుస్తుంది. కావాల్సిన వాళ్ల నుంచి ఆర్డర్లూ రావొచ్చు. అనుకున్నట్లుగానే మీ సమయం వృథా కాకుండా కొత్త కెరియర్‌ మొదలవుతుంది. దాంతోపాటు ఆర్థిక స్వాతంత్య్రం కూడా వచ్చినట్లే. 

తోట పెంపకం
చిన్నప్పటి నుంచి తోట పెంపకంపై ఉండే ఆసక్తిని ఇప్పుడు చిన్న వ్యాపారంగా మలుచుకోవచ్చు. చాలామంది అదే పంథాను ఎంచుకుంటున్నారు కూడా. యూట్యూబ్‌లో మిద్దెతోట పెంపకంపై ఎన్నోరకాల తరగతులు ఉచితంగా నిర్వహిస్తున్నారు. వాటిని అనుసరిస్తే చాలు. వారితో మాట్లాడి సందేహాలను తీర్చుకోవాలి. అలా మీరు సేంద్రియ పద్ధతిలో పెంచే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు ఇంటిల్లపాది ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాదు, మిమ్మల్ని చిరు వ్యాపారిగానూ మారుస్తాయి.

వంటలు
యూట్యూబ్‌లో చాలామంది మహిళలు వంటలను వండి చూపిస్తూ వీడియోలను పొందు పరుస్తున్నారు. పాకశాస్త్రంలో మీరు ప్రవీణులై ఉంటే ఈ రంగాన్ని ధైర్యంగా ఎంచుకోవచ్చు. ఇతరులకు తెలియని రుచులను ఆన్‌లైన్‌లో అందరికీ అందించడానికి ప్రయత్నించాలి. దీని వల్లా ఆర్థిక స్వావలంబన కూడా పొందుతారు.

ఆర్గనైజింగ్‌
మీ ఇంట్లో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకల ఏర్పాట్లు మీరే చేసి అభినందనలు అందుకుంటే మాత్రం ఆర్గనైజింగ్‌లో మీరు నిపుణులనే చెప్పొచ్చు. స్నేహితుల ఇంట్లో జరిగే కొన్ని వేడుకలకు ఉచితంగా ఆర్గనైజర్‌గా వ్యవహరించండి. మీ సామర్థ్యం అందరికీ తెలిసే అవకాశం వస్తుంది. అదే క్రమంగా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారంగా మారుతుంది.మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని