నారీలోకంలో సౌర వెలుగులు
close
Published : 08/07/2021 00:36 IST

నారీలోకంలో సౌర వెలుగులు

ప్రభుత్వ పథకాలతో తాత్కాలిక అవసరాలు తీరి ఆనందించడం మామూలు సంగతి. వాటితో శాశ్వత లబ్ధి పొంది జీవితాన్ని పూలబాటగా మలచుకుంటే? జీవితాల్లో వెలుగులు నింపుకోవచ్చు అని నిరూపిస్తున్నారు ఈ నారీమణులు..

చాన్నాళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సౌర దీపాల తయారీ నేర్పించే పథకం ఒకటి ప్రవేశపెట్టింది. దాన్ని స్కూలు పిల్లలతో మొదలై గ్రామీణ మహిళలకూ విస్తరించారు. ఈ పథకంతో లబ్ధి పొందిన ఇద్దరు యువతుల గురించి సంక్షిప్తంగా చెప్పుకొందాం. ఖజూరీలో ఒక నిరుపేద కుటుంబం. ఎనిమిది మంది పిల్లల్లో నజ్రానీ ఖాన్‌ ఏడో అమ్మాయి. సోషియాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌. అంతకు మించి విజయపథంలో దూసుకుపోతున్న వ్యాపారి. ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని కలిసి మాట్లాడగలిగింది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే ‘ప్రేరణ ఒజాస్‌ ప్రోగ్రామ్‌’ వల్లే. సోలార్‌ దీపాల తయారీలో నైపుణ్యం సంపాదించి ఇప్పుడు సొంతంగా దుకాణం నడిపిస్తోంది. ‘నేను అనుభవించిన దుర్భర దారిద్య్రంలో ఒక సైకిల్‌ గురించి కూడా కలగనలేదు. అలాంటిది ఇప్పుడు స్కూటరు, మొబైలు కొనుక్కున్నాను. అమ్మకు వైద్యం చేయించగలిగాను. అమ్మానాన్నలకు ఆర్థికసాయం చేస్తున్నాను’ అంటూ ఆనందంగా చెబుతుందామె.

పూనమ్‌ది లక్ష్మీపూర్‌ ఖేరీ జిల్లా. ఇద్దరు పిల్లల తల్లి. ఆమె కూడా సోషియాలజీలో పీజీ చేసింది. రోజుకూలీలైన తల్లిదండ్రులు ఆమెని చదివించడానికి చాలానే కష్టపడ్డారు. ‘ఈ పిల్లకి చదువు అవసరమా’ అంటూ తోటివాళ్లు అవమానించడం, ‘ఎంత చదివినా కలుపు తీయాల్సిందే’ లాంటి మాటలతో గేలిచేయడం ఇప్పటికీ గుర్తొస్తాయామెకి. పెళ్లయ్యాక ఆ ఎగతాళులన్నీ నిజమయ్యాయి కూడా. ‘ప్రేరణ ఒజాస్‌’ పథకం అమలవగానే సోలార్‌ దీపాల తయారీలో చేరింది. భర్తతో చెబితే ‘పీజీతోనే ఉద్యోగం రాలేదు, మళ్లీ ఇదొకటా?’ అంటాడని మొదట చెప్పలేదు. ఇప్పుడది ఆదాయం తెచ్చిపెట్టడం చూసి గర్వించడమే కాదు, అతనూ ఆమెతో కలిసి పని చేస్తున్నాడు.

ఇప్పుడు యూపీలో పూనమ్‌, నజ్రానీ లాంటి మహిళలు 4 వేలమంది ఉన్నారు. లక్షలాది సోలార్‌ దీపాలను తయారుచేస్తున్నారు. వీళ్లంతా లాంతర్లు, ఫ్లాష్‌లైట్లు, సోలార్‌ఫ్యాన్లు, టార్చ్‌లు, పవర్‌బ్యాంకులు లాంటివెన్నో అమ్ముతున్నారు, పాడైతే రిపేర్‌ చేస్తున్నారు. ఒక్కో సోలార్‌ ల్యాంప్‌ మార్కెట్లో రూ.500 ఖరీదుండగా వీళ్లు వందకే ఇస్తూ, ‘అయినా లాభమే’ అంటున్నారు. ఈ సౌరదీపాలు వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని