ఏడు తరాలు కాదు.. ఎన్ని బ్రేకప్‌లో తెలుసుకోండి ! - how to know about your boyfriends break up in telugu
close
Updated : 27/06/2021 15:47 IST

ఏడు తరాలు కాదు.. ఎన్ని బ్రేకప్‌లో తెలుసుకోండి !

కులమతాలు ఏవైనా సరే.. గతంలో పెళ్లి తర్వాతే ఒకరి గురించి ఒకరు తెలుసుకొని, అర్థం చేసుకొని, నచ్చినా నచ్చకపోయినా కలిసే ఉండాలని నిర్ణయించుకునేవారు. అయితే ఇప్పుడు రోజులు చాలా మారిపోయాయి. పెళ్లి తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ కాలాన్ని వృధా చేయదల్చుకోవట్లేదు యువతరం. అంతా పెళ్లికి ముందే అర్థం చేసుకొని నచ్చితేనే వివాహం అంటున్నారు. ఒకరకంగా పాశ్చాత్య డేటింగ్ సంస్కృతి మన దగ్గరా ప్రబలిందన్నట్లే ! అయితే ఈ డేటింగ్ యుగంలో అతడు సరైన వాడో కాదో తెలిసేదెలా ? ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే అతడి డేటింగ్ చరిత్రని తిరగేయాల్సిందే అంటున్నారు మానసికవేత్తలు. ఎందుకో చూద్దాం రండి !

పదిమందిని చూసి పదకొండో వ్యక్తిని పెళ్లాడినట్లే... !

పూర్వం పెళ్లి సంబంధం తీసుకొచ్చేటప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలనే వారు. ఎందుకంటే తరం బావుంటే పెంపకం బావున్నట్లే, పెంపకం బావుంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ గుణవంతులన్నట్లే అని పూర్వీకుల నమ్మకం. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం గాంధీ కొడుకు గాంధీ కావాలి, సద్దాం హుస్సేన్ పుత్రుడు సద్దాంలా మారాలి. కాబట్టి అమ్మాయి లేక అబ్బాయి గుణాలకు తరాలతో పనిలేదని యువతరం నిర్ణయించుకొంది. అందుకే డేటింగ్‌ని ఎంచుకుంది. దీన్ని ఓ తప్పులా కాకుండా ఆధునిక పెళ్లి చూపుల్లా చూడాలని యువత అంటోంది. పెళ్లి చూపుల్లో పదిమందిని నచ్చలేదని చెప్పి, నచ్చిన పదకొండో వ్యక్తిని పెళ్లాడినట్లే... డేటింగ్ కూడా సరైన భాగస్వామి కోసమే అని అర్థం చేసుకోమంటోంది.

ఏడు తరాలకు బదులు ఎన్ని బ్రేకప్‌లో తెలుసుకోండి !

చాలామంది అమ్మాయిలు డేటింగ్ చేసే సమయంలో ఓ అభిప్రాయంతో ఉంటారని మానసికవేత్తలు అంటున్నారు. అదే 'గతంతో తమకు పనిలేదు, ప్రస్తుతం తమతో బాగుంటే చాలు' అనే అభిప్రాయం. ఎందుకంటే గతంలో చేదు, తీపి జ్ఞాపకాలు ఎవరికైనా ఉంటాయి కనుక తాము సానుకూలంగా ఉంటామని తెలియజెప్పేందుకే అమ్మాయిలు ఇలా అంటుంటారట. అయితే ఇక్కడే ప్రేమ వివాహాలు కూడా బెడిసికొట్టడానికి తప్పు దొర్లుతోందని మానసికవేత్తలు అంటున్నారు. అన్నిటి గురించీ తెలుసుకోవాల్సిన డేటింగ్ సమయంలో కూడా గతం గురించి దాచిపెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే గతంలో బ్రేకప్‌కు సంబంధించిన విషయాలు చర్చించుకోవాల్సిందే అంటున్నారు.

మూడు ప్రశ్నలతో స్పష్టత ఖాయం !

ఓ సినిమాలో ఓ హాస్య నటుడు ఏ విషయంలోనైనా స్పష్టత రావాలంటే మూడు ప్రశ్నలకు సమాధానం కనుక్కోమంటాడు. అవే.. ఎందుకు ? ఏమిటి ? ఎలా ? అనేవి. ఈ మూడిటి గురించి నేరుగా కాకుండా తమ బుద్ధి కౌశలంతో అబ్బాయిల నుండి కూపీ లాగాలని డేటింగ్ చేస్తున్న యువతులకు సలహా ఇస్తున్నారు మానసిక శాస్త్రవేత్తలు. అబ్బాయిల ఏడు తరాల విషయం కన్నా అతడికి ఎన్ని బ్రేకప్‌లు అయ్యాయో తెలుసుకుంటే అమ్మాయిలకు పర్ఫెక్ట్ పార్ట్‌నర్ దొరికినట్లేనట. మరిందుకు వారు ఇలా చేయమంటున్నారు !

ఎందుకు ?

మీకు పరిచయం అయ్యే వ్యక్తి తనకు ఇన్ని బ్రేకప్‌లు అయ్యాయి అని చెప్పకపోవచ్చు. లేదా తాను కూడా మీలాగే సానుకూలంగా ఉంటానని నిరూపించుకునేందుకు తనకు అంతమందితో బ్రేకప్ అయిందని నిజమే చెప్పొచ్చు. అయితే అతనికి ఎంతమందితో బ్రేకప్ అయిందనే కంటే ఎందుకు బ్రేకప్ అయిందో తెలుసుకోమంటున్నారు మానసిక నిపుణులు. ఇలా కూపీ లాగడం వల్ల, తప్పు అతనిదో లేక అతని లవర్‌దో మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మీ విషయంలో భవిష్యత్తులో అతనెలా స్పందిస్తాడో బేరీజు వేసుకోవచ్చు. దీని వల్ల అతని వ్యక్తిత్వం ఏంటో మీకు తెలిసిపోతుంది. అతని అలవాట్లు, అభిప్రాయాలు తెలుసుకునే కంటే ఇది ఎంతో బెటర్ అంటున్నారు మానసికవేత్తలు.

ఏమిటి ?

డేటింగ్‌లో పరిచయం ప్రేమగా మారే సమయంలో ఒకర్నొకరు ఇంప్రెస్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సమయంలోనే అతడి ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ గురించి కొద్దికొద్దిగా కూపీ లాగమంటున్నారు నిపుణులు. అంటే వారిద్దరి మధ్య ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నమే ఇది. ఈ సమయంలో తన ఎక్స్ గురించి అతను సానుకూలంగా చెబుతున్నాడా, లేక తప్పంతా సదరు అమ్మాయిదే అంటూ మిమ్మల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడో గమనించమంటున్నారు. అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో ఇది కూడా ఉపయోగపడుతుందట. ఎందుకంటే ఇప్పటికీ ఎంత చదువుకున్నా చాలామంది అబ్బాయిలు పాతకాలపు ఆలోచనలతోనే ఉంటుంటారట. తాము చేస్తే ఒప్పు, అదే మరొకరు చేస్తే తప్పు అనే ధోరణితో ఉంటారట. ఇటువంటి వారితో ఎప్పటికైనా దాంపత్యంలో గొడవలు తప్పవు.

ఎలా ?

చూడ్డానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నా.. ఎలా బ్రేకప్ అయింది ? అనే ప్రశ్న మీ డేటింగ్ లవర్ గురించి సరైన సమాధానం ఇవ్వగలదు. కొంతమంది అసలు తమ ఎక్స్ లవర్‌కి ఏమీ చెప్పకుండా బ్రేకప్ చెప్పేసి ఉండవచ్చు, లేదా పరిచయం అయిన మూడు నాలుగు నెలలకే సెండాఫ్ ఇచ్చి ఉండవచ్చు. అవసరం తీరిన తర్వాత బంధాన్ని వదిలించుకునే వ్యక్తిత్వం అయితే ఇటువంటివి డేటింగ్‌లో జరుగుతుంటాయి. కనుక ఎలా బ్రేకప్ చేసుకున్నాడనేది కూడా అవసరమే అంటున్నారు మానసిక నిపుణులు.
పెళ్లికి ముందు ఎన్ని అభిప్రాయాలు కలిసినా తర్వాత వైవాహిక జీవితంలో ఇబ్బందులు, అపార్థాలు తప్పవు. అయితే వాటిని కలిసి పరిష్కరించుకునే వ్యక్తిత్వం ఉన్నవారా కాదా అనే విషయాన్ని అంచనా వేసుకోగలిగితే మీకు డేటింగ్ ద్వారా మంచి పార్ట్‌నర్ దొరికినట్లే ! ఏమంటారు ?

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని