మీ భర్త పూర్తిగా మీవాడు కావాలంటే ఇలా చేయండి..! - tips for wives for sweet relationship
close
Published : 28/07/2021 16:34 IST

మీ భర్త పూర్తిగా మీవాడు కావాలంటే ఇలా చేయండి..!

'నా భర్త నాకే సొంతం.. తను నన్ను తప్ప మరెవరినీ కన్నెత్తి చూడకూడదు.. పన్నెత్తి పలకరించకూడదు.. నేను చెప్పినట్లుగానే నడుచుకోవాలి..' ప్రతి భార్య తన భర్త గురించి ఇలాగే అనుకోవడం సర్వసాధారణం. అయితే ఇవి స్వార్థంతో అనుకునేవి కావు.. భర్తపై భార్య చూపించే ప్రేమకు నిదర్శనం. కానీ ఈ ప్రేమ కేవలం మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపించగలగాలి. అప్పుడే మీ భర్త మీరు గీసిన గీత దాటకుండా ఉండడంతో పాటు మీపై మరింత ప్రేమ కురిపించే అవకాశం ఉంటుంది.

ప్రశంస..

ఎప్పుడూ మీ భర్త నుంచి మీరు ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. మీరు కూడా తను చేసిన పనులను మెచ్చుకోండి. ఉదాహరణకు.. మీకు ఒక రోజు ఒంట్లో బాగోలేదనుకోండి.. అప్పుడు మీ భర్తే మీకు వంట చేసి పెడితే అది రుచిగా ఉన్నా.. లేకపోయినా.. 'మీరు వంట చాలా బాగా చేశారు..' అంటూ ప్రశంసించండి. దీంతో ఆయన ఉప్పొంగిపోతారు. అది ఎంత రుచిగా ఉందో చూడడం కంటే.. మీకోసం ఎంత ప్రేమగా చేసిపెట్టారో గమనించండి. దీనికి మీరు తన దగ్గరకు వెళ్లి ఓ చిరునవ్వుతో 'థాంక్యూ' చెబుతూ నుదుటిపై ఓ ముద్దు పెట్టండి. అంతే.. మీ శ్రీవారు చాలా సంతోషపడతారు. ఇలా ఒకరినొకరు ప్రశంసించుకోవడం వల్ల ఇద్దరి మధ్య ఆత్మీయత, ప్రేమ రెట్టింపవుతాయి.

అత్తమామల ముందు..

తల్లిదండ్రులకు పిల్లలు ఎంత పెద్దవాళ్లయినా చిన్న వాళ్లలాగే కనిపిస్తారు. అలాగే మీ అత్తమామలు కూడా మీ భర్తను చిన్న పిల్లాడిలాగే చూసుకుంటారు. అందుకే వారి ముందు మీ భర్తను ఏదైనా ఓ మాట అంటే వాళ్లు తట్టుకోలేరు.. బాధపడతారు. దీంతో మీ భర్త కూడా బాధపడే అవకాశం ఉంటుంది. తద్వారా మీపై ఆయనకు ప్రేమ పెరగడమేమో గానీ.. తరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ల ముందు ఏమీ అనకుండా.. సందర్భానుసారం పొగడడం, మెచ్చుకోవడం.. చేయాలి. దీనివల్ల మీ భర్తే కాదు.. మీ అత్తమామల దృష్టిలో మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

'తోడూ-నీడ'గా..

భార్యాభర్తలంటే ఒకరికొకరు జీవితాంతం తోడూ-నీడగా ఉండాలి. ఈ క్రమంలో భర్త భార్య మాట జవదాటకుండా ఉండాలంటే.. భర్త ఏదైనా ఒక సందర్భంలో తెలియక చిన్న తప్పు చేసినా సర్దుకుపోయేంత ఓపిక భార్యలో ఉండాలి. లేదంటే ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించే క్రమంలో భర్తకు వెన్నంటే నిలవాలి. వారికి ఎప్పటికప్పుడు కొత్తగా, ఆకర్షణీయంగా కనిపించాలి. ఇలాంటి సానుకూల అంశాలే భర్తను భార్యకు కట్టిపడేసేలా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అధిక భారం వద్దు..

భర్తే ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవాలనే ఉద్దేశంతో అన్ని పనులూ ఆయన మీదే వేయకూడదు. కొన్ని పనులు మీరు చూసుకుంటూ.. మరికొన్ని పనుల్లో వారికి సహాయం చేయాలి. పిల్లల్ని చూసుకోవడం, ఇంటికి కావలసిన సరుకులు మీరే స్వయంగా తెచ్చుకోవడం.. వంటి చిన్న చిన్న పనులు భర్తపై పడేయకుండా మీరే చేసుకోవడం వల్ల వారికి సహాయపడ్డట్లుగా ఉండడంతో పాటు వారిపై అధిక భారం పడకుండా ఉంటుంది. అలాగే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైతే.. అన్ని ఖర్చులూ భర్తే భరించడం కాకుండా.. మీరూ అందులో పాలుపంచుకోవాలి. వీలుంటే ఇద్దరూ కలిసి ఒకటిగా ఖర్చు పెట్టాలి. ఇలా భారమంతా మీ భర్తపైనే వేయకుండా.. మీకు వీలైన పనుల్లో సహాయపడడం వల్ల కూడా ఆయనకు మీపై మంచి అభిప్రాయం ఏర్పడి మీ మాట మీరకుండా ఉండే అవకాశం ఉంటుంది.

భూతద్దంలో చూస్తున్నారా??

భార్యాభర్తలన్నాక చిలిపి తగాదాలు కామన్. ఉదాహరణకు ఏదో ఒక సందర్భంలో మీ భర్త మిమ్మల్ని చిలిపిగా ఏదైనా అన్నారనుకోండి.. అదే ఆలోచిస్తూ వారిపై విరుచుకుపడడం, మీరూ ఒత్తిడికి గురికావడం.. వంటివి చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీసే ప్రమాదం ఉంది.. కొంతమందైతే ఇలాంటి విషయాల్ని మనసులో పెట్టుకుని మరోసారి వాళ్లను దెప్పిపొడుస్తారు. కానీ అది మంచిది కాదు. ఒకవేళ మీ భర్త మిమ్మల్ని నొప్పించే మాట ఏదైనా అన్నా కూడా దాన్ని వీలైనంత త్వరగా మర్చిపోయే ప్రయత్నం చేయాలి.. లేదంటే మరోసారి అలా అనకుండా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం కూడా మంచి పద్ధతే. ఫలితంగా మీకూ, మీ బంధానికి ఎలాంటి ఢోకా ఉండదు.

చిన్న చూపు వద్దు..

ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించడం సర్వసాధారణమైపోయింది. అయితే భర్తల కంటే ఎక్కువగా సంపాదించే భార్యలు కూడా చాలామందే ఉన్నారు. అంతమాత్రాన వాళ్లను చిన్నచూపు చూడడం మంచిది కాదు.. ఇది మీ బంధానికే ముప్పు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అభిప్రాయాలు మీ ఆలోచన పరిధుల్లోకి రాకుండా ఉండడమే మంచిది. ఇలా ఉంటే మీరు మంచి భార్యగా గుర్తింపు పొందడమే కాదు.. మీ భర్తకు మీపై ప్రేమ మరింతగా పెరిగి మీరు చెప్పినట్లు నడుచుకునే అవకాశం కూడా ఉంటుంది.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని