Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
ప్రతి డీఎన్‌ఏలోనూ ఆవిష్కరణ ఉంది
అందరికీ ఉపయోగపడే ప్రతి పరిష్కారమూ ఆవిష్కరణే
ఇప్పటి విద్యార్థులకు అసలైన చరిత్ర దూరమవుతోంది
నేతలు, తల్లిదండ్రులు పాశ్చాత్య నాగరికతనే రద్దుతున్నారు
టెక్నోజియాన్‌ విద్యార్థులతో ఈమెయిల్‌ సృష్టికర్త శివా అయ్యదురై
ఈనాడు, హన్మకొండ: ఆవిష్కరణ అనేది ప్రపంచంలో ఎవరైనా చేయవచ్చని, ప్రతి భారతీయుడి డీఎన్‌ఎలో ఆవిష్కరణ అనేది దాగుందని ఈమెయిల్‌ రూపకర్త డాక్టర్‌ శివా అయ్యదురై పేర్కొన్నారు. ఆయన అమెరికా నుంచి నేరుగా దూరదృశ్య సమీక్ష (వీడియో కాన్ఫరెన్స్‌) ద్వారా వరంగల్‌ ఎన్‌ఐటీ టెక్నోజియాన్‌లో పాల్గొన్న విద్యార్థులతో శనివారం మాట్లాడారు. తాను ఈమెయిల్‌ను 14 ఏళ్ల వయసులోనే ఆవిష్కరించిన తీరును వివరించారు. ఆవిష్కరణ చేసి మనసులో పెట్టుకుంటే లాభంలేదని, అందరికీ తెలిసేలా, ఉపయోగపడేలా ప్రచారం అవసరమని ఆయన వెల్లడించారు. ‘వ్యవసాయ కుటుంబానికి చెందిన నేను ముంబయి సమీపంలోని ఓ గ్రామంలో పెరిగాను. మా అమ్మమ్మ పురాణాల్లో ఉండే మంచి విషయాల్ని నాకు చెప్పేది. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి సమాజాన్ని చూసే నేను ఈమెయిల్‌ను సృష్టించా. ప్రపంచంలో ఇప్పుడున్న సాంకేతిక ఆవిష్కరణలన్నీ పురాణాలతో ముడిపడి ఉన్నవేనని’ ఆయన వివరించారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

డిజిటల్‌ ఇండియా మీద మీ అభిప్రాయమేంటి?
మంచి కార్యక్రమం. అయితే మనం అనుకోవాల్సింది డిజిటల్‌ ఇండియా అని కాదు.. ఇన్నోవేషన్‌ ఇండియా అని. మనం పెద్దపెద్ద సమస్యల్ని కూడా పరిష్కరించే దిశగా కదలాలి. అందుకు ఆవిష్కరణలే మార్గమని నేనంటాను.

మనదేశంలో ఆవిష్కర్తలు ఉన్నారు. కానీ వారు వెలుగులోకి రావట్లేదు. కారణమేంటి?
వేల సంవత్సరాల క్రితమే మన దేశీయులు గణితాన్ని కనుగొన్నారు. ఆయుర్వేదం, యోగా, ఉక్కుతో పడవలు చేయడం వంటివీ చేశారు. భారతీయులు చాలాపెద్ద ఆవిష్కర్తలుగా చరిత్ర చెబుతోంది. కానీ పాశ్చాత్య నాగరికతతో అదంతా మరుగున పడుతోంది. పాశ్చాత్య దేశాల ప్రభావం వల్ల నువ్వు ఇదే చేయాలని ఒత్తిడితెచ్చే పద్ధతి వచ్చింది. ఒకప్పుడు పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేసేవాళ్లం. ఇప్పుడు అవి లేకుండా చేయలేకపోతున్నాం. తెలివి తక్కువ నేతలు మనల్ని తప్పుదోవపట్టిస్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రికెళ్తే ఎం.ఆర్‌.ఐ చేయాలంటారు.. మా అమ్మమ్మ ముఖం చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేది. అంటే మన చరిత్రను ఇతర దేశీయులు దోచుకెళ్తున్నారు. అలా తీసుకుంటే బిల్‌గేట్స్‌ కూడా ఆవిష్కర్త కాదు. అతను డాస్‌ను దొంగిలించి అమ్ముతున్నాడు. మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా ఆవిష్కర్త కాదు. నా మాటలు మీకు కోపం తెప్పించవచ్చు. కానీ ఇదే నిజం. ఆర్యభట్ట విశ్వం గురించి ఎప్పుడో చెప్పారు. కానీ ఇప్పటి విద్యార్థులకు ఇవన్నీ సరిగా తెలియడంలేదు. వీకీపీడియా, ఇంటర్నెట్‌నే నమ్ముకుని కూర్చుంటే చరిత్ర తెలియదు. దానికోసం పుస్తకాలు చదవాలి, నిజాలేంటో తెలుసుకోవాలి. పాశ్చాత్య ప్రభావంతో మనదేశం చాలా కోల్పోతోంది. తల్లిదండ్రులు కూడా నువ్వు ఇదే చెయ్‌ అని చెబుతున్నారు.

ఆవిష్కర్తల్ని తయారుచేసే బాధ్యతను మీరుతీసుకోవచ్చుకదా?
నేనొక పుస్తకాన్ని రాశాను. ఆ ఈ-బుక్‌ నా వెబ్‌సైట్‌ (vashiva.com)లో ఉంది. నేను మనదేశంలోని 50 పాఠశాలలను సందర్శించి పిల్లల్లో స్ఫూర్తినింపేందుకు ప్రయత్నించాను. దూరదృశ్య సమీక్షల ద్వారా ప్రసంగాలు చేస్తున్నాను. ఆవిష్కరణలకు పునాదులు వేసేలా.. ప్రతిఏటా కొంతమంది విద్యార్థుల్ని ఎంపికచేసి ఆ ప్రయత్నం చేస్తున్నాం.

మన చరిత్రను మార్చేశారని మీరు భావిస్తున్నారా? అలాంటప్పుడు మనమేం చేయగలం?
అవును చరిత్రను మార్చేశారు. అందుకే మనమంతా అవగాహనాపరులుగా మారాలని అంటున్నాను. ఇప్పటి ఉపాధ్యాయులకు చరిత్ర సరిగా తెలియదు. కాబట్టే చరిత్ర మూలాల్ని పిల్లలకు చెప్పట్లేదు. నేను విద్యార్థులకు చెప్పేదొక్కటే.. చరిత్ర మూలాల్ని తెలిపే పుస్తకాలు చదవండి. మన దేశ చరిత్ర ఏంటో చదవండి.

అసలు ఆవిష్కరణ అంటే ఏంటి?
ఈ పదానికి ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెబుతారు. నా దృష్టిలో సమస్యను పరిష్కరించే ఒక మార్గాన్ని కనుగొనాలి, ఆ మార్గాన్ని సమాజంలో మిగిలినవారూ పాటించగలిగేలా ఉంటే అది కచ్చితంగా ఆవిష్కరణే.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

ఫైనల్‌లో వారియర్స్‌

రెండోసారి సీసీఎల్‌ ట్రోఫీ గెలవాలన్న తెలుగు వారియర్స్‌ నెరవేరడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. శనివారం హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net