నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా

తాజావార్తలు


నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా
కాఠ్‌మాండూ: నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షభం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనడానికి ముందే ఆ దేశ ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. భారత్‌, చైనాతో సత్సంబంధాలు మెరుగుపరిచేలా కృషి చేసినందుకే నేపాలీ కాంగ్రెస్‌, మావోయిస్టులు తన ప్రభుత్వంపై కుట్ర చేశారని ఈ సందర్భంగా ఓలీ ఆరోపించారు.

గత పదేళ్లలో ఏర్పడిన ఎనిమిదో ప్రభుత్వం ఇది. 2015 అక్టోబర్‌లో కేపీ ఓలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సీపీఎన్‌-మావోయిస్టు సెంటర్‌ , నేపాల్‌ కాంగ్రెస్‌ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. సంకీర్ణ ప్రభుత్వంలో కీలక మద్దతుదారులైన మాదేసి పీపుల్స్‌ రైట్స్‌ ఫోరమ్‌-డెమోక్రాటిక్‌, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించడంతో ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.