Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
మిగిలింది మట్టే
ఏం చేస్తున్నారండి?
ఉపరితల బొగ్గు గని తవ్వుతున్నాం.
మంచిది. ఎన్నేళ్ల నుంచి?
రెండేళ్ల కిందట ప్రారంభించాం.
ఎంత ఖర్చయింది ఇప్పటికి?
రూ.22 కోట్లు
అయితే... బాగానే బొగ్గు
తీసుంటారు కదా.
ఎంత లాభం వచ్చిందేంటి?
అది... అది... బొగ్గు తీయలేదండి.
మట్టి తొలగిస్తున్నామంతే.
ఆ...!
సింగరేణి అధికారుల మాయాజాలం సహ చట్టంతో బయటపడింది. ఉపయోగం లేని పనుల పేరిట ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్లు తేలింది.

ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి ప్రాంతంలోని ఎంకె-4, దాని అనుబంధ ఎంకె-4ఏ గనులు నష్టాల్లో ఉన్నాయి. అయితే... ఇక్కడ ఉపరితల గని (ఓసీపీ) లేదు. అందుకే నష్టాలు వస్తున్నాయని అధికారులు ఓ వాదనను తెరపైకి తెచ్చారు. రామకృష్ణాపూర్‌లో దాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. జులై, 2009లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఓసీపీకి శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఓసీపీలను ప్రారంభించే ముందు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ, అటవీ, పర్యావరణశాఖల అనుమతి తప్పనిసరి. అయితే... అటవీ శాఖ నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రాకముందే 2010లో గనిని ప్రారంభించారు.

సగం స్థలమే వారిది!
ఓసీపీ ఏర్పాటుకు 637.52 హెక్టార్ల స్థలం అవసరం. అందులో సింగరేణి పరిధిలోది 397.67 హెక్టార్లే. 202.50 హెక్టార్లు అటవీ శాఖ, 37.35 హెక్టార్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. అటవీశాఖ అనుమతులు పొందడం సుదీర్ఘ ప్రక్రియ. ఎన్నో నిబంధనలను పాటించాలి. ఆ సంగతి సింగరేణికి తెలుసు. అయినా... అప్పటి వరకు ఎవరు వేచి చూస్తారనో ఏమో తన స్థలంలో మట్టి తొలగింపు పనులు ఆరంభించింది. వివిధ విభాగాలకు చెందిన 1200 మంది సిబ్బందిని ఇక్కడకు బదిలీ చేసింది. రెండేళ్లుగా ‘మట్టి’ పనే చేయిస్తోంది. ఇంత వరకూ బొగ్గు పెళ్ల కూడా వెలికితీయలేదు. మరోవైపు... దీనికోసం భూగర్భ గనులను మూసేశారు. దాంతో అక్కడ బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. దాంతో నష్టాలు ఇంకా పెరిగాయి.

అంతా ప్రజల సొమ్మే
ఉపరితల గనికి సంబంధించి ఇప్పటి వరకు చేసిన పనులు, వాటికైన ఖర్చు వివరాలను అడుగుతూ ‘ఈనాడు ముందడుగు’ ప్రతినిధి సహ దరఖాస్తు చేశారు. సంస్థకు చెందిన స్థలంలో 1.20 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తీసినట్లు సమాచారం వచ్చింది. మార్చి 31, 2012 నాటికి ఓసీపీ నిర్మాణ పనులకు రూ.22.72 కోట్లను వెచ్చించినట్లు సంస్థ పేర్కొంది.
- పూర్ణచందర్‌ కాయల,
న్యూస్‌టుడే, ఆదిలాబాŸþ
అందుకే ఆరంభించాం
అటవీ శాఖ అనుమతులు ఈ ఏడాది డిసెంబరులో రావచ్చు. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు జిల్లా అటవీశాఖ నుంచి వెళ్లాయి. సింగరేణి కార్పోరేటు యాజమాన్యం అనుమతితోనే రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించాం.
- కె.ప్రకాశ్‌బాబు, మందమర్రి డీజీఎం

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net