కేంద్రం వైపు.. కృష్ణా బోర్డు చూపు

ప్రధానాంశాలు

కేంద్రం వైపు.. కృష్ణా బోర్డు చూపు

వచ్చే వారంలో కేంద్ర జల్‌శక్తి

అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌!

ఈనాడు హైదరాబాద్‌: ఒక రాష్ట్రం ప్రాజెక్టులను స్వాధీనం చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది, కానీ నిబంధన పెట్టింది. ఇంకో రాష్ట్రం నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో తదుపరి కార్యాచరణ ఏంటన్నదానిపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు కేంద్ర జల్‌శక్తి  మంత్రిత్వశాఖ ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. వచ్చే వారంలో జల్‌శక్తి అధికారులు కృష్ణా, గోదావరి బోర్డుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం అక్టోబరు 14 నుంచి రెండో షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులు బోర్డుల నిర్వహణలోకి రావాల్సి ఉంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో బోర్డు అధికారులు విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించారు. కనీసం ఉమ్మడి ప్రాజెక్టులనైనా మొదటి దశలో అప్పగించేలా ఒప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుత పరిణామాలన్నింటిపై వచ్చే వారంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ, బోర్డు అధికారులు సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని