రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ప్రజలు ఆవేశాలకు గురికావొద్దు

ప్రధానాంశాలు

రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ప్రజలు ఆవేశాలకు గురికావొద్దు

డీజీపీ గౌతమ్‌సవాంగ్‌

ఈనాడు, అమరావతి: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ప్రజలు ఆవేశాలకు గురికావొద్దని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దు. దాడులకు పాల్పడిన, చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠినచర్యలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాల్ని మోహరించాం. ప్రజలంతా సంయమనం పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి’ అని డీజీపీ పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసు ప్రధాన కార్యాలయం మంగళవారం ఓ  ప్రకటన విడుదల చేసింది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని